ఎంజీ గ్లూస్టర్‌ సావీలో కీలక మార్పులు.. ధర తగ్గనుందా?

MG Motors Modified Gloster Savvy Will Release On August 9 - Sakshi

MG Motors Glooster Saavy ఆటోమొబైల్‌ ఇండస్ట్రీలో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ విషయంలో కటింగ్‌ టెక్నాలజీ అందించే లక్ష్యంతో ఇటీవల రిలయన్స్‌ జియోతో జట్టు కట్టిన ఎంజీ మోటార్స్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైఎండ్‌ లగ్జరీ వెహికల్‌గా ఉన్న గ్లూస్టర్‌లో మరో మార్పు చేసింది.

ఎంట్రీ లెవల్‌ లగ్జరీ ఎస్‌యూవీ
ఎంజీ మోటార్స్‌ సంస్థ ఎలాగైనా భారత మార్కెట్‌లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ బ్రాండ్‌ నుంచి ఎంజీ హెక్టార్‌, గ్లూస్టర్‌ మోడళ్లు సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతున్నాయి. ఎంజీ హెక్టార్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఉండగా గ్లూస్టర్‌ ఎంట్రీ లెవల్‌ ప్రీమియం లగ్జరీ ఎస్‌యూవీ కేటగిరిలో ఉంది. గ్లూస్టర్లో సూపర్‌, స్మార్ట్‌, షార్ప్‌, సావీ వేరియంట్లలో ఈ కారు లభిస్తోంది. ఇందులో సూపర్‌, షార్ప్‌ వేరియంట్లు సెవన్‌ సీటర్లుగా ఉన్నాయి. సావీ పూర్తి లగ్జరీ కారుగా సిక్స్‌ సీట్‌ లే అవుట్‌తోనే మార్కెట్‌లో కొససాగుతోంది.

ఆగస్టు 9న
ఇండియన్‌ మార్కెట్‌ డిమాండ్‌కి తగ్గట్టుగా సేవీ సీటింగ్‌ లేవుట్‌లో మార్పులు చేసింది. సెవన్‌ సీటర్‌ కార్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సావీ వేరియంట్‌లోనూ ఏడుగురు కూర్చునేలా మార్పులు చేసింది. సెవన్‌ సీటర్‌ సావీ కారుని ఆగస్టు 9న మార్కెట్‌లో విడుదల చేయనుంది. 

హై ఎండ్‌ మోడల్‌
ఎంజీ మోటార్‌ ఇండియాకు సంబంధించి గ్లూస్టర్‌ సావీనే హై ఎండ్‌ మోడల్‌. ఇందులో అనేక అధునాత ఫీచర్లు ఉ‍న్నాయి. ముఖ్యంగా అడ్వాన్స్‌డ్‌ డ్రైవింగ్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ సాయంతో ఈ కారును డ్రైవ్‌ చేయడం పార్క్‌ చేయడం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌ స్పీడ్‌తో పాటు డిమాండ్‌ను బట్టి ఫోర్‌ డ్రైవింగ్‌ను సైతం అందిస్తోంది. ఇక సెవన్‌ డిఫరెంట్‌ టెర్రైన్‌ డ్రైవింగ్‌ మోడ్‌లు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 6 సీటర్‌ గ్లూస్టర్‌ సావీ ధర రూ. 44.59 లక్షలుగా ఉంది. సెవన్‌ సీటర్‌ లే అవుట్‌ ధర తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top