UK Man Hires NASA Linked Experts: భార్య చేసిన తప్పును..సరిదిద్దేందుకు రంగంలోకి నాసా శాస్త్రవేత్తలు...!

Man Hires NASA Linked Experts To Find Hard Drive With 7500 Bitcoins Accidently Trashed - Sakshi

Man Hires NASA Linked Experts To Find Hard Drive With 7500 Bitcoins: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ భారీ ఆదరణ నోచుకుంటుంది. వీటికి అంతస్థాయిలో ఆదరణ రావడానికి ముఖ్య కారణం ఒకటి ట్యాక్స్‌ ఫ్రీ, మరోకటి పకడ్బంది భద్రత. క్రిప్టోకరెన్సీల లావాదేవీలను బ్లాక్‌చైయిన్‌ టెక్నాలజీ ఉపయోగించి చేస్తారు. ఆయా యూజర్లు క్రిప్టోకరెన్సీలను ఎన్‌క్రిప్టెడ్‌ సెక్యూరిటీతో భద్రంగా ఒక హర్డ్‌ డిస్క్‌లో సేవ్‌ చేసుకోవచ్చును.  కాగా యూకేకు చెందిన జేమ్స్‌ హూవెల్స్‌ మాజీ భార్య చేసిన చిన్న పొరపాటు అతడిని బిలియనీర్‌ కాకుండా చేసింది. 

చెత్త బుట్టలో పడేసిన భార్య..!
ప్రపంచంలోని అత్యంత దురదృష్టవంతుడు అంటే ఇతడేనెమో...! బహుశా..! 36 ఏళ్ల జేమ్స్‌ హోవెల్స్‌ మాజీ భార్య చేసిన పొరపాటుతో ఏకంగా 7500 బిట్‌కాయిన్లను పొగొట్టుకున్నాడు. అతడి భార్య 2013లో 7500 బిట్‌కాయిన్ల హార్డ్‌ డిస్క్‌ను చెత్త బుట్టలో పడేసింది. ఈ హర్డ్‌ డిస్క్‌ను వెతకడం కోసం నాసా శాస్త్రవేత్తలను నియమించుకున్నాడు.    

బిలియనీర్‌ కావాల్సినోడు..
జేమ్స్‌ హూవెల్స్‌ మాజీ భార్య చేసిన చిన్న పొరపాటు బిలియనీర్‌ అవ్వకుండా చేసింది. నేడు 7500 బిట్‌కాయిన్ల విలువ నేడు ఇండియన్‌ కరెన్సీలో దాదాపు 3,404 కోట్లకు సమానం. పొగొట్టుకున్న హర్డ్‌ డిస్క్‌ను సంపాదించేందుకు అమెరికా ఒన్‌ట్రాక్‌ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. వీరు గతంలో కొలంబియా స్పేస్‌ షటిల్‌ భూమిపై కూలిపోయినప్పుడు నాసాకు సహయాన్ని అందించింది. ఈ హార్డ్‌ డిస్క్‌ను పొందేందుకు ముమ్మర ప్రయత్నాలను చేస్తున్నాడు జేమ్స్‌. ఈ హర్డ్‌ డిస్క్‌ వెతుకులాటలో ఒన్‌ట్రాక్‌ విజయవంతమైతే దానిని క్రాక్‌ చేయడంతో జేమ్స్‌ రాత్రికి రాత్రే బిలియనీర్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అక్కడి స్ధానిక సౌత్‌ వేల్స్‌ పోలీసులు హార్డ్‌డిస్క్‌ వెతికేందుకు ఇంకా పర్మిషన్‌ ఇవ్వలేదు. 

చదవండి: ఇండియన్‌ ఫాస్టెస్ట్‌ ఛార్జింగ్‌ స్మార్ట్‌ఫోన్‌...! షావోమీ నుంచి..ధర ఏంతంటే..?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top