LIC Jeevan Umang Policy: Invest Rs 44 and Get a Return in Lakhs - Sakshi
Sakshi News home page

ప్రతి రోజు రూ.44 పొదుపు చేస్తే.. రూ.27 లక్షలు మీ సొంతం..!

Published Mon, Dec 20 2021 6:02 PM

LIC Jeevan Umang Policy: Invest Rs 44 to Get Rs 27 Lakhs - Sakshi

ప్రభుత్వ బీమా రంగ సంస్థ ఎల్‌ఐసీ సామాన్యులను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను ముందుకు తీసుకుని వస్తుంది. అందులో భాగంగా తీసుకొచ్చిన జీవన్‌ ఉమంగ్‌ అనే పాలసీకి ప్రజల నుంచి భారీగా ఆదరణ లభిస్తోంది. ఈ పాలసీ వల్ల పాలసీదారుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా కూడా ఉంటుంది. అలాగే పాలసీ మొత్తం ప్రీమియంలు పూర్తిగా చెల్లిస్తే ఫించను తరహాలో పాలసీలో నిర్దేశించిన కాలపరిమితికి ప్రయోజనాలు కూడా అందుతాయి. జీవన్ ఉమాంగ్ పాలసీ ఇతర పాలసీలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. 

  • క్లెయిమ్‌ కనీస హామీ మొత్తం : రూ.2 లక్షలు
  • గరిష్ఠ హామీ మొత్తం : పరిమితి లేదు
  • ప్రీమియం చెల్లిండానికి కాల పరిధి(ఏళ్లలో) : 15, 20, 25, 30 
  • కనీస వయస్సు : 90 రోజులు
  • గరిష్ఠ వయస్సు : 55 ఏళ్లు
  • ప్రీమియం చెల్లించడం పూర్తయ్యే నాటికి ఉండాల్సిన కనీస వయస్సు : 30 ఏళ్లు
  • ప్రీమియం చెల్లించడం పూర్తయ్యే నాటికి ఉండాల్సిన గరిష్ఠ వయస్సు : 70 ఏళ్లు
  • పాలసీ మెచ్యూరిటీకి గరిష్ఠ వయస్సు : 100 ఏళ్లు

నెలకు రూ.1302 చెల్లిస్తే.. ఏకంగా రూ.27.60 లక్షలు లభిస్తాయి. ఒకవేళ పాలసీదారుడు పాలసీ టర్మ్‌లో మరణిస్తే.. మెచ్యూరిటీ డబ్బులను కుటుంబ సభ్యులకు అందిస్తారు. ప్రీమియం చెల్లింపు గడువు ముగిసిన తర్వాత ప్రతి ఏడాది పాలసీ మొత్తంలో 8 శాతం డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇలా 99 ఏళ్ల వయసు వరకు వస్తాయి. మెచ్యూరిటీ సమయంలో మళ్లీ ఒకేసారి చేతికి డబ్బులు వస్తాయి. ఉదాహరణకు ఒక ఏడాది వయస్సు గల వ్యక్తి రూ.5 లక్షల మొత్తానికి ఈ పాలసీ తీసుకున్నారని అనుకుందాం. పాలసీ టర్మ్ 30 ఏళ్లు. అంటే 30 ఏళ్ల వచ్చే వరకు ప్రీమియం కట్టాలి నెలకు రూ.1302 పడుతుంది. 

31 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది మీరు జమ చేసిన మొత్తం మీద 8 శాతం వడ్డీ లభిస్తుంది. అంటే మీరు జమ చేసిన మొత్తం ప్రతి ఏడాది రూ.40 వేలు వస్తాయి. పాలసీదారుడు 100 ఏళ్ల జీవిస్తే.. అప్పుడు ఒకేసారి దాదాపు రూ.27.60 లక్షలు వస్తాయి. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహం. జీవిత బీమాతో పాటుగా, మెచ్యూరిటీ తర్వాత ఏకమొత్తంలో డబ్బు లభిస్తుంది. మెచ్యూరిటీ తరువాత, మీ ఖాతాలోనికి ప్రతి సంవత్సరం స్థిర ఆదాయం డిపాజిట్ చేయబడుతుంది. మరోవైపు, ఏకమొత్తం చెల్లింపు పాలసీదారుని కుటుంబ సభ్యులకు నామినీ మరణం తరువాత వస్తుంది. ఈ ప్లాన్ మరో ప్రయోజనం ఏమిటంటే, ఇది 100 సంవత్సరాల వరకు మిమ్మల్ని కవర్ చేస్తుంది.

(చదవండి: అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లకు న్యూఇయర్‌ బంపర్‌ గిఫ్ట్‌..!)

Advertisement
Advertisement