యూజర్లకు ఎల్‌ఐసీ హెచ్చరిక! పర్మిషన్ లేకుండా అలా చేస్తే..

LIC Alert Users About Fake Ads And Warn Unauthorize Logo Use - Sakshi

న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ Life Insurance Corporation పేరుతో వచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ బీమా దిగ్గజం హెచ్చరించింది.  ఎల్‌ఐసీ లోగోను చూపిస్తూ, ఆకర్షణీయమైన రాబడుల ప్రతిపాదనలతో వల వేసే విశ్వసనీయం కాని సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని యూజర్లను ఎల్‌ఐసీ కోరింది. విశ్వసనీయం కాని సంస్థలు ఎల్‌ఐసీ లోగోను సోషల్‌ మీడియాలో దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు ఒక నోటీసును జారీ చేసింది. 

ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో ఎల్‌ఐసీ లోగోను చూపిస్తూ విశ్వసనీయం కాని సంస్థలు ఇచ్చే ప్రకటనలు, ప్రతిపాదనలకు ఆకర్షితులు కావద్దని కోరింది. ‘‘కొన్ని గుర్తు తెలియని సేవల సంస్థలు, ఏజెంట్లు.. వెబ్‌సైట్లు, యాప్‌లు సృష్టించి, బీమా, బీమా సలహా సేవలను ఎల్‌ఐసీ ట్రేడ్‌మార్క్‌ పేరుతో ఆఫర్‌ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది’’ అని నోటీసులో పేర్కొంది.

డేటాను చోరీ చేసే ఉద్దేశ్యంతో సాఫ్ట్‌వేర్, యాప్‌ల సాయంతో అనధికారికంగా ఎల్‌ఐసీ పోర్టల్‌కు అనుసంధానాన్ని కల్పిస్తున్నట్టు గుర్తించామని తెలిపింది.

ఎల్ఐసీ ఉద్యోగులకు, పెన్షన్ పాలసీదారులకు గుడ్​న్యూస్..!

అలర్ట్‌: ఫేస్‌బుక్‌లో వీడియో లింక్‌తో గాలం, ఆపై..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top