Kumar Mangalam Birla: కుమార్ మంగళం బిర్లా ఖరీదైన కార్లు - రోల్స్ రాయిస్ నుంచి జాగ్వార్ దాకా..

Kumar mangalam birla expensive cars rolls royce mercedes benz and more - Sakshi

Kumar Mangalam Birla Car Collection: భారతదేశంలో ఉన్న అగ్రశ్రేణి ధనవంతులలో ఒకరైన 'కుమార్ మంగళం బిర్లా' (Kumar Mangalam Birla) గురించి దాదాపు అందరికి తెలుసు. ఈయన ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ మాత్రమే కాకుండా.. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌కి ఛాన్సలర్ కూడా. గతంలో ఈయన సక్సెస్ సీక్రెట్, నికర ఆస్తులు వంటి వాటిని గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ కథనంలో మంగళం బిర్లా ఉపయోగించే లగ్జరీ కార్లను గురించి తెలుసుకుందాం.

రోల్స్ రాయిస్ ఘోస్ట్ (Rolls Royce Ghost)
ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార్ మంగళం బిర్లా ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కారుని (రోల్స్ రాయిస్ ఘోస్ట్) కలిగి ఉన్నారు. ఈ కారు ఖరీదు రూ. 8 కోట్లు (ఎక్స్-షోరూమ్). అయితే ఇది కొంత కస్టమైజేషన్ పొందినట్లు తెలుస్తోంది.  సుమారు రూ. 9 కోట్లు వరకు ఉండవచ్చు. ఈ కారుని ఆయన అప్పుడప్పుడు మాత్రమే వినియోగిస్తారని సమాచారం.

ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ రోల్స్ రాయిస్ ఘోస్ట్ ముఖేష్ అంబానీ వంటి పారిశ్రామిక వేత్తల గ్యారేజిలో కూడా ఉంది. ఇందులో 6.7 లీటర్ వి12 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 520 బిహెచ్‌పి పవర్, 780 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గరిష్ఠ వేగం గంటకు 250 కిమీ.

మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్500 (Mercedes-Maybach S500)
జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థకు మెర్సిడెస్ కంపెనీకి చెందిన అత్యంత ఖరీదైన కారు 'మేబ్యాచ్ ఎస్500' సెడాన్ కూడా కుమార్ మంగళం బిర్లా గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 1.86 కోట్లు. ఇందులో 4663 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 453 బిహెచ్‌పి పవర్, 700 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సెడాన్ కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ వరకు ఉంది. భారతదేశంలోని సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఇది ప్రధానమైనదని.

బీఎండబ్ల్యూ 760ఎల్ఐ (BMW 760LI)
కుమార్ మంగళం బిర్లా గ్యారేజిలో ఉన్న కార్లలో బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 760ఎల్ఐ ఒకటి. దీని ధర రూ. 2.46 కోట్లు.  రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొనుగోలు చేయడానికి ముందు ఈయన ఎక్కువగా ఈ కారునే ఉపయోగించేవారని సమాచారం. ఇది బుల్లెట్ ప్రూఫ్ సెడాన్. కావున వినియోగదారులకు పటిష్టమైన భద్రతను అందిస్తుంది. ఇందులోని 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ 850 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ సెడాన్ టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ. ఇది కేవలం 3.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగవంతమవుతుంది.

(ఇదీ చదవండి: పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, హెలికాఫ్టర్స్.. ఇంకా ఎన్నో..!)

జాగ్వార్ ఎక్స్ఎఫ్ (Jaguar XF)
బ్రిటీష్ వాహన తయారీ సంస్థకు చెందిన జాగ్వార్ ఎక్స్ఎఫ్ 'కుమార్ మంగళం బిర్లా' గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 55.67 లక్షలు. ఇందులోని 2.0 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ 247 బిహెచ్‌పి పవర్ & 365 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లగ్జరీ కారు కేవలం 7.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతమవుతుంది. టాప్ స్పీడ్ గంటకు 365 కిమీ.

(ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - ఓ యువకుని సక్సెస్ స్టోరీ)

బీఎండబ్ల్యూ 5 సిరీస్ (BMW 5-Series)
బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన మరో కారు 5 సిరీస్ కుమార్ మంగళం బిర్లా గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 62.90 లక్షలు. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉండే ఈ కారు 2993 ఇంజిన్ కలిగి 261 బిహెచ్‌పి పవర్ పవర్, 620 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం కాగా, టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ.

28 సంవత్సరాల వయసులో తండ్రి మరణించిన తరువాత ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేప్పట్టిన కుమార్ మంగళం బిర్లా  47 బ్రాండ్‌లు, 27 ఎంటర్‌ప్రైజెస్, 14 పరిశ్రమ రంగాలను విజయపథంలో నడిపిస్తున్నాడు. ప్రస్తుతం కంపెనీ ఆదాయం రూ.50000 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top