ఐటీ జాబ్ పోయి ఉబెర్ డ్రైవర్‌గా మారిన ఇండియన్ - వీడియో వైరల్

Indian Techie Job Loss In Canada He Drives Tesla For Uber Grocery Video Viral - Sakshi

కరోనా మహమ్మారి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలను ముప్పుతిప్పలు పెట్టి ఆర్థికమాంద్యంలోకి నెట్టివేసింది. ఈ ప్రభావం చాలామంది జీవితాల మీద పడింది. ఇప్పటికి కూడా కొన్నిదేశాల్లోని దిగ్గజ కంపెనీలు సైతం ఆర్థిక మాంద్యం తట్టుకోలేక తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఒకవైపు చదువు కోసం విదేశాలకు వెళ్లిన చాలా మంది భారతీయులు సమస్యలను ఎదుర్కొంటుంటే.. మరికొందరు ఉద్యోగాలు కోల్పోయి అగచాట్లు పడుతున్నారు.

కెనడాలో ఉంటున్న ఒక భారతీయుడు ఉద్యోగం కోల్పోయి ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత, యూట్యూబ్ ఛానెల్‌ కలిగి ఉన్న టెకీ తన టెస్లాను డ్రైవ్ చేస్తూ నిత్యావసర వస్తువులను డెలివరీ చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అనీష్ మావెలిక్కర తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో.. తాను ఐటీ ఉద్యోగం కోల్పోయినట్లు, కొత్త ఉద్యోగం కోసం వెతుక్కున్నట్లు.. ఇందులో భాగంగానే కొన్ని ఇంటర్వ్యూలకు హాజరైనట్లు, దానికి సంబంధించిన రిజల్ట్ ఇంకా రాలేదని వెల్లడించాడు.

ఇదీ చదవండి: రెజ్యూమ్‌ ఇలా క్రియేట్ చేస్తే.. జాబ్ రావాల్సిందే!

ఉద్యోగం వచ్చే వరకు పార్ట్ టైమ్ ఉద్యోగంగా కిరాణా సామాగ్రిని ఇంటింటికి డెలివరీ చేస్తున్నట్లు కూడా వీడియోలో తెలిపాడు. ప్రతి రోజూ తన పని తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమవుతుందని, తన టెస్లా కారుని ఉబెర్‌తో నడుపుతున్నట్లు స్పష్టం చేసాడు. ఒకవేళా ఉద్యోగం లభించకపోతే తన టెస్లా కారుని రోజంతా డ్రైవ్ చేయాల్సి ఉంటుందని తెలియజేస్తూ.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ వీడియో ఓ చిన్న ఉదాహరణగా వివరించాడు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top