విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయ్‌.. | India records 81 04 billion dollars FDI inflow in FY25 | Sakshi
Sakshi News home page

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయ్‌..

May 29 2025 9:32 AM | Updated on May 29 2025 9:38 AM

India records 81 04 billion dollars FDI inflow in FY25

న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) గత ఆర్థిక సంవత్సరంలో పెరిగాయి. 2024–25లో 13% వృద్ధితో 50 బిలియన్‌ డాలర్లు తరలివచ్చినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. కాగా, 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇవి 44.42 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. మొత్తం ఎఫ్‌డీఐలు(ఈక్విటీలు, రిఇన్వెస్టెడ్‌ ఎర్నింగ్స్, ఇతర మూలధనం) 14% పెరిగి 81.04 బిలియన్‌ డాలర్లుగా నిలిచాయి. గడిచిన మూడేళ్లలో ఇదే అత్యధికం. 2023–24లో ఇవి 71.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

  •     సమీక్షా కాలం(2024–25లో)లో సింగపూర్‌ నుంచి అత్యధిక (14.95 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులు వచ్చాయి. తర్వాతి స్థానాల్లో మారిషస్‌(8.34 బి. డాలర్లు), అమెరికా (5.45 బి. డాలర్లు), నెదర్లాండ్స్‌(4.62 బి.డాలర్లు), యూఏఈ(3.12 బి.డాలర్లు), జపాన్‌(2.47 బి.డాలర్లు), సైప్రస్‌(1.2 బి.డాలర్లు), యూకే(795 మిలియన్‌ డాలర్లు), జర్మనీ (469 మి.డాలర్లు), కైమన్‌ ఐస్‌లాండ్‌(371 మి.డాలర్లు) ఉన్నాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2023–24)తో నెదర్లాండ్స్, జపాన్, యూకే, జర్మన్‌ల నుంచి పెట్టుబడులు తగ్గాయి.

  •     రంగాల వారీగా చూస్తే... సర్వీసెస్, ఎగుమతి, టెలికమ్యూనికేషన్, ఆటోమొబైల్, నిర్మాణాభివృద్ధి, పునరుత్పాదక, రసాయన రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, నిర్మాణ కార్యకలాపాలు, ఫార్మాస్యూటికల్స్‌ రంగాల్లో పెట్టుబడులు తగ్గాయి.  

  •     2024–25లో అత్యధికంగా మహారాష్ట్ర (19.6 బి.డాలర్లు) ఎఫ్‌డీఐ పొందింది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక (6.61 బి.డాలర్లు), న్యూఢిల్లీ (6 బి.డాలర్లు), గుజరాత్‌ (5.7 బి.డాలర్లు), తమిళనాడు (3.68 బి.డాలర్లు), హర్యానా (3.14 బి.డాలర్లు), తెలంగాణ (2.99 బి.డాలర్లు)లు ఉన్నాయి.  

  •     కాగా గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏడాది ప్రాతిపదికన 24.5 శాతం తగ్గి 9.34 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. 2023–24 ఏడాది ఇదే త్రైమాసికంలో భారత్‌లోకి 12.38 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement