అమెరికాకు ఎల్రక్టానిక్స్‌ ఎగుమతులు రెండు రెట్లు | Sakshi
Sakshi News home page

అమెరికాకు ఎల్రక్టానిక్స్‌ ఎగుమతులు రెండు రెట్లు

Published Sat, Jan 20 2024 5:23 AM

India electronics exports to US jump over two-fold to USD 6. 6 bn in Jan-Sep 2023 - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ నుండి అమెరికాకు ఎల్రక్టానిక్స్‌ ఎగుమతులు  2023 జనవరి–సెపె్టంబర్‌ మధ్య వార్షిక ప్రాతిపదికన రెండు రెట్లు పెరిగి 6.6 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయని ఇండస్ట్రీ బాడీ– ఐసీఈఏ (ఇండియన్‌ సెల్యులర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌) తెలిపింది.  6.6 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు భారత్‌ నుంచి ఆల్‌ టైమ్‌ గరిష్ట స్థాయని ఐసీఈఏ చైర్మన్‌ మహీంద్రూ తెలిపారు.

ఆయన తెలిపిన సమచారం ప్రకారం,  చైనా నుండి అమెరికా మార్కెట్లోకి దిగుమతి అయ్యే ఎల్రక్టానిక్స్‌ ప్రొడక్టుల వాటా తగ్గింది. ఇటీవలి గణాంకాల ప్రకారం, భారతదేశ ఎల్రక్టానిక్స్‌ ఎగుమతుల్లో చెప్పుకోదగ్గ పెరుగుదల నమోదయ్యింది. 2021–22 జనవరి–సెపె్టంబర్‌ మధ్య అమెరికాకు భారత్‌ ఎల్రక్టానిక్స్‌ ఎగుమతుల విలువ 2.6 బిలియన్‌ డాలర్లు. 2022–23 ఇదే కాలంలో ఈ విలువ సుమారు 253 శాతం పెరిగి 6.6 బిలియన్లకు చేరుకుంది. 

2018లో ఈ విలువ 1.3 బిలియన్‌ డాలర్లయితే, 2022లో 4.5 బిలియన్‌ డాలర్లని మహీంద్రూ వెల్లడించారు.  భారత్‌–అమెరికాల మధ్య మధ్య ద్వైపాక్షిక ఎల్రక్టానిక్స్‌ వాణిజ్యం కూడా 84 శాతం మేర రికార్డు స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు. 2021–22 జనవరి–సెపె్టంబర్‌ మద్య ఈ విలువ 4.9 బిలియన్‌ డాలర్లయితే, 2022–23 ఇదే కాలంలో ఈ విలువ 9 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని పేర్కొన్నారు. 2023లో ద్వైపాక్షిక ఎల్రక్టానిక్స్‌ వాణిజ్య విలువ 8.4 బిలియన్‌ డాలర్లుకాగా, దశాబ్ద కాలంలో ఈ విలువను 100 బిలియన్‌ డాలర్లు చేర్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ బాటలో ఇండో–అమెరికా టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.   
 
భారీ లక్ష్యం సాధనే ధ్యేయం
కాగా, భారత్‌–అమెరికా టాస్క్‌ ఫోర్స్‌ ఫర్‌ ఎల్రక్టానిక్స్‌ కేవలం స్వల్ప కాలిక ప్రయోజనాలకు సంబంధించినది కాదని టాస్క్‌ ఫోర్స్‌ ఆన్‌ ఎల్రక్టానిక్స్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ పేర్కొన్నారు. భారీ ఎగుమతులకు సంబంధించి ఒక లక్ష్యాన్ని నెలకొల్పడానికి ఉద్దేశించినదని వివరించారు.  ‘‘ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం 9 నెలల్లో 9 బిలియన్‌ డాలర్లుగా అంచనా. ఇది చక్కటి అభివృద్ధిగా మేము పరిగణిస్తున్నాము. ఇప్పుడు మా లక్ష్యం ఈ వేగాన్ని మరింత పెంచడం.

అమెరికా ఎల్రక్టానిక్స్‌ మార్కెట్‌లో భారత్‌ స్థానాన్ని గణనీయంగా మెరుగుపరచాలన్నది మా లక్ష్యం‘ అని మీడియాతో ఆయన అన్నారు. అమెరికాకు భారత్‌ ఎల్రక్టానిక్స్‌ ఎగుమతుల పెరుగుదల ప్రపంచ ఎల్రక్టానిక్స్‌ మార్కెట్‌లో మన దేశ సామర్థ్యాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రపంచ ఎల్రక్టానిక్స్‌ వాణిజ్యంలో భారత్‌ ప్రాముఖ్యతను వెల్లడిస్తోందన్నారు.  

ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులపై భారత్‌ ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. ఈ విభాగంలో రాబోయే 3  నుంచి 5 సంవత్సరాల్లో 5 రెట్లు వృద్ధిని భారత్‌  సాధించగలమని తాము భావిస్తున్నట్లు తెలిపారు.  

చైనా నుంచి భారీగా తగ్గుదల
చైనా నుండి అమెరికాకు మొత్తం దిగుమతుల్లో ఎల్రక్టానిక్స్‌ వాటా 2018లో 46 శాతం. జనవరి–సెపె్టంబర్‌ 2023లో ఇది  24 శాతానికి తగ్గింది. 2018 అనేక చైనా వస్తువులపై 25 శాతం సుంకాలను (ట్రంప్‌ టారిఫ్‌లు)  అమెరికా విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు  వియత్నాం, తైవాన్‌ల నుంచి  అమెరికాకు 2018 నుంచి 2022 మధ్య భారీగా ఎల్రక్టానిక్స్‌ ఎగుమతులు పెరగడం గమనార్హం. ఆయా దేశాల నుంచి వరుసగా ఎగుమతులు 420 శాతం, 239 శాతం మేర పెరిగాయి.  క్లిష్టమైన భౌగోళిక రాజకీయ సమస్యలు, సరఫరా గొలుసులను వైవిధ్యం వంటి అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటుండడం గమనార్హం.  

4 ఏళ్లలో భారీ వృద్ధి  
దేశీయంగా ఎలక్ట్రానిక్స్‌ పరికరాల వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది. వచ్చే 3–4 ఏళ్లలో భారత్‌ చెప్పుకోతగ్గ స్థాయిలో విడిభాగాల ఎగుమతిదారుగా ఎదిగే సామర్థ్యం ఉంది.  మొబైల్‌ రంగానికి ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకంతో అదనంగా 5 లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయి. రాబోయే అయిదేళ్లలో ఇది మరింతగా పెరుగుతుంది. దేశీయంగా డిజైన్‌ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటున్నాం. ఇది దేశానికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఎల్రక్టానిక్స్‌ పరికరాల తయారీ కూడా వృద్ధి చెందుతోంది. వచ్చే 3–4 ఏళ్లలో మొబైల్‌ ఫోన్ల తరహాలోనే మనం విడిభాగాలను కూడా గణనీయంగా ఎగుమతి చేయబోతున్నాం.  
– అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి

Advertisement
 
Advertisement