
భారత్‌ను అంతర్జాతీయ ఆటోమోటివ్ దిగ్గజంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ 2047 రూపకల్పనపై కసరత్తు జరుగుతున్నట్లు భారీ పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి హనీఫ్ ఖురేషి తెలిపారు. పర్యావరణహితంగా, కొత్త ఆవిష్కరణలకు తోడ్పాటు అందించే విధంగా ఈ విధానం ఉంటుందని చెప్పారు.
ఇదీ చదవండి: పన్ను రిఫండ్ మెయిల్స్ పట్ల జాగ్రత్త
ఆటోమోటివ్ రంగం పురోగతి, ఎగుమతుల వృద్ధికి సంబంధించిన లక్ష్యా లు, విధానాలపై చర్చించేందుకు ఏఎంపీ 2047 సబ్ కమిటీలు సమావేశమైనట్లు వివరించారు. 2030, 2037, 2047 మైలురాళ్లను లక్ష్యంగా పెట్టుకుని సమగ్ర ప్రణాళికను రూపొందించేందుకు ఏడు సబ్–కమిటీలు ఏర్పాటైనట్లు చెప్పారు. వీటిలో ప్రభుత్వం, పరిశ్రమ, విద్యా రంగం నుంచి నిపుణులు ఉన్నారన్నారు.