బెంగళూరుని వెనక్కి నెట్టి.. నంబర్‌ వన్‌ స్థానంలో హైదరాబాద్‌!

 Hyderabad Crossed Bengaluru In Office Leasing In Third Quarter - Sakshi

ఐటీ సెక్టార్‌ ఇండియన్‌ క్యాపిటల్‌గా పేర్కొందిన బెంగళూరుకి హైదరాబాద్‌ ఝలక్‌ ఇచ్చింది. ఆఫీస్‌ స్పేస్‌ లీజు విషయంలో గత కొన్నేళ్లుగా నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతున్న సిటీ ఆఫ్‌ గార్డెన్స్‌ని వెనక్కి నెట్టింది ముత్యాల నగరం. 

కరోనా పూర్వపు స్థితి
కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత దేశవ్యాప్తంగా ఆర్తిక కార్యకలాపాలు వేగంగా ఊపందుకుంటున్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సైతం జోరుగా సాగుతుండటంతో ఉద్యోగులు తిరిగి ఆఫీసుల బాట పడుతున్నారు. దీంతో ఆఫీసు స్పేస్‌కి ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. దాదాపుగా కరోనాకు ముందున్న స్థితికి ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ చేరుకుంది. 

ప్లేస్‌ మారింది
జులై, ఆగస్టు, సెప్టెంబరులకు సంబంధించి మూడో త్రైమాసికంలో దేశవ్యాప్తగా దాదాపు 1.3 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ లీజు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. అయితే ప్రతీసారి ఆఫీస్‌ స్పేస్‌ విషయంలో సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండేంది. మిగిలిన ఐదు మెట్రో నగరాలు ఆ తర్వాతే అన్నట్టుగా పరిస్థితి ఉండేంది. అయితే ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చింది.

నంబర్‌ వన్‌ 
ఈ ఏడాది మూడో త్రైమాసికం ఆఫీస్‌ స్పేస్‌ లీజుకి సంబంధించి హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఏకంగా 25 లక్షల చదరపు అడుగుల స్థలానికి సంబంధించిన లీజు అగ్రిమెంట్లు పూర్తి అయ్యాయి. అంతకు ముందు ఏప్రిల్‌, మే, జూన్‌తో పోల్చితే ఈసారి అగ్రిమెంట్లు వేగంగా పూర్తి కావడంతో హైదరాబాద్‌ ముందుకు దూసుకుపోయింది.
మన తర్వాతే
మూడో త్రైమాసికానికి సంబంధించి ఆఫీసు లీజు విషయంలో 29 శాతం వాటాతో హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉండగా 25 శాతం వాటాతో పూనే రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు నగరాల తర్వాతే మిగిలిన మెట్రో సిటీలైన బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నైలు ఉన్నాయి.
ఇక్కడే ఎక్కువ
భాగ్యనగరంలో ఆఫీసు ప్లేస్‌కి సంబంధించి రాయదుర్గం ఏరియాలో డిమాండ్‌ ఎక్కువగా ఉంది. నగరంలో బుక్కయిన 25 లక్షల చదరపు అడుగుల స్థలంలో సగం ఇక్కడున్న భవనాల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో హైటెక్‌ సిటీ ఉంది. లుక్‌ ఈస్ట్‌ అంటూ రాష్ట​‍్ర ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలను కోరుతున్నా.. ఇంకా ఆశించిన స్థాయి ఫలితాలు రావడం లేదు. 

చదవండి:మనీ గురించి ఆలోచించకు.. లగ్జరీగా ఉంటే చూడు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top