టీఆర్‌సీ కంపెనీస్‌ చేతికి మ్యాజిక్‌మైండ్స్‌ | Hyderabad Based Company Magikminds Gets Acquired By Trc | Sakshi
Sakshi News home page

టీఆర్‌సీ కంపెనీస్‌ చేతికి మ్యాజిక్‌మైండ్స్‌

Nov 19 2022 10:11 AM | Updated on Nov 19 2022 10:11 AM

Hyderabad Based Company Magikminds Gets Acquired By Trc - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న మ్యాజిక్‌మైండ్స్‌ను టీఆర్‌సీ కంపెనీస్‌ కొనుగోలు చేసింది. 2010లో ఏర్పాటైన మ్యాజిక్‌మైండ్స్‌ సంస్థ జియోస్పేషియల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (జీఐఎస్‌) కన్సల్టింగ్‌ సేవలు అందిస్తోంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని యుటిలిటీస్, టెలికం సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయి. భారత్‌లో డెలివరీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఉంది.

130 మంది కన్సల్టెంట్లు ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా 40 పైగా క్లయింట్లకు సేవలు అందిస్తున్నామని మ్యాజిక్‌మైండ్స్‌ డైరెక్టర్‌ చైతన్య చల్లా తెలిపారు. అటు 1969లో ఏర్పాటైన టీఆర్‌సీ అంతర్జాతీయంగా 1,000 పైచిలుకు సంస్థలకు టెక్నాలజీ ఆధారిత ఇంజినీరింగ్, కన్సల్టింగ్‌ తదితర సర్వీసులు అందిస్తోంది.

చదవండి: భారత్‌లో వన్‌ అండ్‌ ఓన్లీ గుర్తింపు.. మారుతీ సుజుకీ సొంతం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement