Make Money With Chat GPT: 'చాట్‌జీపీటీ' తో డబ్బులు సంపాదించడం ఎలాగో తెలుసుకోండి!

How To Earn Money From Chat Gpt In 2023 With Best Method - Sakshi

గూగుల్‌కు గుబులు పుట్టిస్తున్న చాట్‌జీపీటీని యూజర్లు చాట్‌జీపీటీ సాయంతో డబ్బులు ఎలా సంపాదించవచ్చు’ అని ప్రశ్నిస్తున్నారు. చాట్‌ జీపీటీ ఇచ్చిన సమాధానాల్ని సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

తాజాగా చాట్‌జీపీటీని అడిగిన ప్రశ్నలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నా​యి. వాటిలో  2023లో చాట్‌జీపీటీ సాయంతో డబ్బులు సంపాదించడం ఎలా? అని ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. ఇక యూజర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చాట్‌జీపీటీని ఉపయోగించి 7 మార్గాల్లో డబ్బులు సంపాదించవచ్చని ఏఐ మోడల్ సమాధానం ఇచ్చింది. 
 
1. చాట్‌జీపీటీ ఉపయోగించి చాట్‌బాట్‌ తయారు చేసి వాటికి లైసెన్స్‌ పొందవచ్చు. అనంతరం వ్యాపార సంస్థలకు లేదంటే వ్యక్తులకు అమ్ముకోవచ్చు. డబ్బులు సంపాదించవచ్చు.  ఈ చాట్‌బాట్‌ సాయంతో కస్టమర్ సర్వీస్, వర్చువల్ అసిస్టెన్స్ లేదా ఇతర పనులకు ఉపయోగించవచ్చు.

2. చాట్‌జీపీని సొంతం ప్రాజెక్ట్‌లలో ఇంటిగ్రేట్‌ చేయొచ్చు. కన్సల్టింగ్‌, డెవలప్‌మెంట్‌ సర్వీసుల్ని అందించవచ్చు.  

3. ఏఐ ఆధారిత చాట్‌బోట్‌ సాయంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌లు, లేదా ఇండస్ట్రీస్‌కు సంబంధించిన డేటాను తయారు చేసి.. కోర్సుల పేరుతో ఆ డేటాను అమ్ముకోవచ్చు. 

4. చాట్‌జీపీటీ అందించే యూనిక్‌ అండ్‌ ఎంగేజింగ్‌ కంటెంట్‌ సాయంతో సోషల్‌ మీడియా, బ్లాగ్స్‌, వెబ్‌సైట్స్‌ను రన్‌ చేయొచ్చు. తద్వారా యాడ్స్‌, ప్రమోషనల్‌ యాడ్స్‌ను డిస్‌ప్లే చేసి ఆదాయాన్ని గడించవచ్చు.

5.మీకు స్టాక్‌ మార్కెట్‌పై పట్టుంటే చాట్‌జీపీని ఉపయోగించి ఆటోమెటెడ్‌ ట్రేడింగ్‌ను స్ట్రాటజీని బిల్డ్‌ చేయొచ్చు. ట్రేడింగ్‌, లేదంటే కన్సల్టింగ్‌ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజీలను అప్లయి చేసి మనీ ఎర్న్‌ చేయొచ్చు. 

6. అంతేకాదు చాట్‌జీపీటీ బేస్డ్‌ చాట్‌బోట్‌ను తయారు చేసి కస్టమర్‌ సర్వీస్‌, వర్చువల్‌ అసిస్టెంట్స్‌ పేరుతో సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌తో డబ్బులు సంపాదించవ్చు. 

7. చాట్‌ జీపీటీతో లాంగ్వేజెస్‌ను ఉపయోగించే సంబంధింత బిజినెస్‌లలో కొన్ని పనులు చేసేందుకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌, టెక్ట్స్‌ సమరైజేషన్‌ వంటి పనులు చేస్తూ ఉపాధి పొందవచ్చు.

చదవండి👉 ChatGPT: యూజర్లకు భారీ షాక్‌.. చాట్‌ జీపీటీకి కొత్త చిక్కులు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top