రోబోటిక్‌ వీల్‌చైర్‌..శరీరాన్ని వంచితే చాలు..దానంతట అదే వెళ్తుంది!

Honda Develops A Hands Free Wheelchair That Moves Like A Hoverboard - Sakshi

నడవలేని స్థితి ఎదురైనప్పుడు ఎవరైనా వీల్‌చైర్‌ను ఆశ్రయించక తప్పదు. వీల్‌చైర్‌లో కూర్చుంటే, వెనుక నుంచి ఎవరో ఒకరు ముందుకు నెడితే తప్ప కదలడం సాధ్యం కాదు. వీల్‌చైర్‌ల తయారీలోనూ ఇటీవల అధునాతన మార్పులు వస్తున్నాయి.

తాజాగా, జపాన్‌కు చెందిన బహుళజాతి వాహనాల తయారీ సంస్థ ‘హోండా’ ఈ రోబోటిక్‌ వీల్‌చైర్‌ను రూపొందించింది. మోటార్‌తో రూపొందించిన కొన్ని వీల్‌చైర్లను చేతులతో కోరుకున్న దిశకు నడపాల్సి ఉంటుంది. హోండా తయారుచేసిన ఈ వీల్‌చైర్‌ మాత్రం చేతులకు శ్రమపెట్టదు. ఇది పూర్తిగా రోబోటిక్‌ సాంకేతికతతో పనిచేస్తుంది. 

ఇందులో కూర్చున్న వ్యక్తి ఎటువైపుగా వెళ్లాలనుకుంటే, అటువైపుగా కాస్త శరీరాన్ని వంచితే చాలు. ఇది దానంతట అదే ఆ దిశగా ముందుకు సాగుతుంది. దీనిని స్టార్ట్‌ చేయాలన్నా, స్థిరంగా నిలపాలన్నా కావలసిన బటన్లు చేతికి అందుబాటులో ఉంటాయి. ‘యూని–వన్‌’ పేరిట రూపొందించిన ఈ రోబోటిక్‌ వీల్‌చైర్‌ ఇంకా మార్కెట్‌లోకి విడుదల కావాల్సి ఉంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top