Honda City Hybrid e: HEV Production Starts in India - Sakshi
Sakshi News home page

Honda City Hybrid e: వచ్చేస్తున్నాయి..హోండా సిటీ హైబ్రిడ్‌ కార్లు..బుకింగ్స్‌ షురూ..!

Apr 20 2022 2:20 PM | Updated on Apr 20 2022 3:35 PM

Honda City Hybrid E:Hev Production Starts in India Bookings Open at Rs 5000 - Sakshi

వచ్చేస్తున్నాయి..హోండా సిటీ హైబ్రిడ్‌ కార్లు..బుకింగ్స్‌ షురూ..!

న్యూఢిల్లీ: కొత్తగా ప్రకటించిన సిటీ కారు ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ వెర్షన్‌ ’ఇ:హెచ్‌ఈవీ’ ఉత్పత్తిని ప్రారంభించినట్లు హోండా కార్స్‌ ఇండియా (హెచ్‌సీఐఎల్‌) వెల్లడించింది. రాజస్థాన్‌లోని తాపుకారా ప్లాంట్‌లో వీటిని తయారు చేస్తున్నట్లు వివరించింది. హోండా సిటీ ఇ:హెచ్‌ఈవీని వచ్చే నెల తొలినాళ్లలో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ ప్రెసిడెంట్‌ టకుయా సుమురా తెలిపారు.

డీలర్ల దగ్గర రూ. 21,000 లేదా కంపెనీ వెబ్‌సైట్‌లో రూ. 5,000 చెల్లించడం ద్వారా కారును బుక్‌ చేసుకోవచ్చని వివరించా రు. ఇందులో విశిష్టమైన సెల్ఫ్‌ చార్జింగ్‌ ఫీచర్‌ ఉందని పేర్కొన్నారు. 3 ఏళ్ల అన్‌లిమిటెడ్‌ కిలోమీటర్ల స్టాండర్డ్‌ వారంటీ ఉంటుందని, లిథియం అయాన్‌ బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కి.మీ. (ఏది ముందైతే అది) వివరించారు.  

చదవండి: ఒకే సారి రూ. 3 లక్షల వరకు పెంపు..ఈ కంపెనీ కార్లు మరింత ప్రియం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement