2023 Hero XPulse 200 4V Launched In India At Rs 1.43 Lakh: Check Price, Specs, Features - Sakshi
Sakshi News home page

Hero Motocorp: భారత్‌లో హీరో ఎక్స్‌పల్స్ 200 4వి లాంచ్ - పూర్తి వివరాలు

May 16 2023 9:38 PM | Updated on May 17 2023 10:08 AM

Hero xpulse 200 4v updated bike launched price feature and details - Sakshi

Hero Xpulse 200 4V: భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు అప్డేటెడ్ 'హీరో ఎక్స్‌పల్స్ 200 4వి' (Hero Xpulse 200 4V) విడుదలైంది. అదే సమయంలో ర్యాలీ ఎడిషన్ ప్రో వేరియంట్‌గా కొత్త రూపంలో అందుబాటులోకి వచ్చింది. ఈ లేటెస్ట్ బైక్ ధరలు, ఇతర ఫీచర్స్ వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం.

ధరలు
దేశీయ మార్కెట్లో విడుదలైన అప్డేటెడ్ హీరో ఎక్స్‌పల్స్ 200 4వి బైక్ ధర రూ. 1.44 లక్షలు, కాగా ర్యాలీ ఎడిషన్ ప్రో ధర రూ. 1.51 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). ఈ బైక్స్ వాటి మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతాయి.

డిజైన్ & ఫీచర్స్
మార్కెట్లో అడుగుపెట్టిన ఈ లేటెస్ట్ బైక్స్ అప్డేటెడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందుతుంది, కావున ఇది మునుపటి కంటే చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అంతే కాకుండా పొడవైన విండ్‌స్క్రీన్‌, కొత్త స్విచ్ గేర్ వంటివి మరింత ఫ్రీమియంగా ఉంటాయి. బ్లాక్ ఎలిమెంట్స్ స్థానములో ఇవి పెద్ద హ్యాండ్ గార్డ్‌లను పొందుతాయి. ఇవన్నీ రైడర్‌కి మరింత మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. 

ఇంజిన్
అప్డేటెడ్ హీరో ఎక్స్‌పల్స్ బైకుల ఇంజిన్లలో పెద్దగా మార్పులు జరగలేదు. కానీ 200 సిసి ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇప్పుడు ఓబిడి-2 కంప్లైంట్‌తో పాటు ఈ20 అనుకూలతను పొందుతుంది. ఇంజిన్ 19.1 hp పవర్, 17.35 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ ఇప్పుడు సింగిల్ ఛానల్ ఏబీఎస్ కోసం రోడ్, ఆఫ్-రోడ్, ర్యాలీ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. 

ఈ బైకులో ఫుట్ పెగ్‌లు ఇప్పుడు 35 మి.మీ తక్కువ, వెనుక 8 మి.మీ ఎక్కువతో సెట్‌ చేశారు. కావున రైడింగ్ చేయడానికి మునుపటికంటే చాలా అనుకూలంగా ఉంటుంది. USB ఛార్జర్ మరింత అనుకూల ప్రదేశంలో నిక్షిప్తం చేశారు. ఇక ప్రో వేరియంట్‌ ర్యాలీ కిట్ పొందటం వల్ల రెండు చివర్లలో లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ పెరిగి అడ్జస్టబుల్, బెంచ్ స్టైల్ సీట్, హ్యాండిల్‌బార్ రైజర్‌లు లభిస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలు, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement