కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక: తొలి ఆరు నెలల్లో.. | Government Plans Rs 8 Lakh Crore Market Borrowing | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక: తొలి ఆరు నెలల్లో..

Apr 3 2026 8:14 PM | Updated on Apr 3 2026 8:17 PM

Government Plans Rs 8 Lakh Crore Market Borrowing

కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలానికి (2026–27 ఏప్రిల్‌-సెప్టెంబర్) రూ.8 లక్షల కోట్ల రుణాలను మార్కెట్‌ నుంచి సమీకరించే ప్రణాళికతో ఉంది. ఆదాయం లోటును పూడ్చుకునేందుకు డేటెడ్‌ సెక్యూరిటీల జారీ ద్వారా ఈ మేరకు నిధులను సమకూర్చుకోనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.17.20 లక్షల కోట్లను మార్కెట్‌ నుంచి నిధుల రూపంలో సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది.

బడ్జెట్‌ సమర్పణ అనంతరం, ప్రభుత్వ సెక్యూరిటీల (జీసెక్‌) మార్పిడి ప్రక్రియలు నిర్వహించడంతో స్థూల మార్కెట్‌ రుణాలు రూ. 16.09 లక్షల కోట్లకు తగ్గాయని తెలిపింది. ‘‘రూ.16.09 లక్షల కోట్లకు గాను రూ.8.20 లక్షల కోట్లను (మొత్తం లక్ష్యంలో 51%) మొదటి ఆరు నెలల్లో డేటెడ్‌ సెక్యూరిటీల ద్వారా సమీకరించనున్నాం.

ఇందులో రూ.15,000 కోట్లు సావరీన్‌ గ్రీన్‌ బాండ్ల జారీ కూడా ఉంటుంది. 2026–27లో వాస్తవ ద్రవ్యలోటు రూ.16.9 లక్షల కోట్లుగా ఉంటుంది. ఈ లోటును భర్తీ చేసుకునేందుకు డేటెడ్‌ సెక్యూరిటీల జారీ ద్వారా మార్కెట్‌ నుంచి నికర రుణ సమీకరణ రూ.11.7 లక్షల కోట్లుగా ఉంటుంది. మిగిలిన మొత్తం చిన్న మొత్తాల పొదుపు నిధులు, ఇతర వనరుల రూపంలో సమకూర్చుకోనున్నాం’’ అని ఆర్థిక శాఖ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement