న్యూ ఇయర్‌లో లేఆఫ్స్‌ బాంబ్‌.. భారీ ఎత్తున గూగుల్‌,అమెజాన్‌ ఉద్యోగుల తొలగింపు!

Google Fire 6 Percent Of Employees In 2023 - Sakshi

వచ్చే ఏడాదిలో భారీ ఎత్తున ఉద్యోగులు తొలగింపు ఉంటుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.ఈ తరుణంలో ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌,అమెజాన్‌ ఉద్యోగులపై లేఆఫ్స్‌ బాంబు పేల్చాయి. 2023లో పనితీరు సరిగ్గా లేని కారణంగా 6 శాతం ఉద్యోగుల్ని గూగుల్‌ ఫైర్‌ చేయనున్నట్లు సమాచారం. గూగుల్‌ బాటలో అమెజాన్‌ సైతం లేఆఫ్స్‌కు తెరతీసింది.  

గత వారం గూగుల్‌ తన ఉద్యోగులతో సమావేశం నిర్వహించింది. ఆ మీటింగ్‌లో ఫుల్‌ టైమ్‌ ఉద్యోగుల్లో 6 శాతం (10వేల) మంది పేలవమైన  పనితీరు ప్రదర్శిస్తున్న జాబితాలో ఉన్నట్లు గూగుల్‌ అంచనా వేస్తోంది. 22 శాతం మంది ఉద్యోగులు పనితీరు బాగుండగా..మరికొంత మంది ఉద్యోగులు సంస్థ తెచ్చిన కొత్త వర్క్‌ కల్చర్‌లో విధానపరమైన, సాంకేతిక సమస్యలపై  ఫిర్యాదు చేస్తున్నారని నివేదిక పేర్కొంది.

అంచనాలకు మించి 
పనితీరు ఆధారంగా వర్క్‌ ఫోర్స్‌ని తగ్గించాలని గూగుల్‌  యోచిస్తున్నట్లు ఇటీవలి నివేదిక పేర్కొంది. కంపెనీ కొత్త విధానంలో ఉద్యోగుల పనితీరును అంచనా వేస్తోంది. నివేదిక ప్రకారం, ఒక ఉద్యోగి అత్యధిక రేటింగ్ పొందిన కేటగిరీలో ఉండాలనుకుంటే తప్పనిసరిగా సంస్థ అంచనాలను మించి పనితీరు ఉండాలి.

స్పందించని సుందర్‌ పిచాయ్‌ 
గూగుల్‌ నిర్వహించిన ఉద్యోగుల మీటింగ్‌లో లేఆఫ్స్‌పై ప్రకటన వస్తుందని సిబ్బంది ఆందోనళన వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా సీఈవో సుందర్‌ పిచాయ్‌ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడ లేదు. అయితే కంపెనీ ప్రతిదానిపై పూర్తి పారదర్శకతను ఉంచుతుందని ఉద్యోగులకు చెప్పినట్లు, లేఆఫ్స్‌ ఉన్నాయా? లేవా? హెడ్‌కౌంట్‌లను ఎలా ఫైర్‌ చేయాలో ఆలోచిస్తున్నట్లు సదరు నివేదిక హైలెట్‌ చేసింది. 

ముందుగానే హెచ్చరికలు 
వచ్చే ఏడాది తొలగింపులు ఉంటాయంటూ ఈ ఏడాది నుంచి గూగుల్‌ ఉద్యోగుల్ని అప్రమత్తం చేసింది. గూగుల్‌తో పాటు అమెజాన్‌ సైతం వచ్చే ఏడాది ఉద్యోగుల తొలగింపులపై ధృవీకరించింది. ఆ తొలగింపు సంఖ్యపై ఆ సంస్థ యాజమాన్యం స్పందించలేదు. కానీ అమెజాన్‌ 20వేల మందిని తొలగించాలని యోచిస్తోందంటూ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top