3 నెలల గరిష్టానికి పసిడి | Gold Price Surges to 3-Month High Silver Jumps | Sakshi
Sakshi News home page

3 నెలల గరిష్టానికి పసిడి

Aug 21 2026 7:49 AM | Updated on Aug 21 2026 7:52 AM

Gold Price Surges to 3-Month High Silver Jumps

న్యూఢిల్లీ: డాలరు బలహీనపడి, ఇన్వెస్టర్లు ఇతరత్రా కమోడిటీలవైపు మళ్లుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు గురువారం భారీగా పెరిగాయి. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 4,300 ఎగసి రూ. 1,62,300కి చేరుకుంది. ఇది మూడు నెలల గరిష్టం కావడం గమనార్హం. చివరిసారిగా మే 26న బంగారం ధర రూ. 1,62,400 వద్ద ట్రేడయ్యింది.

అటు వెండి కూడా ర్యాలీ చేసి, ఏడు వారాల గరిష్టానికి ఎగసింది. కేజీకి రూ. 10,000 పెరిగి రూ. 2,45,000 వద్ద ముగిసింది. వెండి చివరిసారిగా జూలై 3న ఈ స్థాయిలో ట్రేడయ్యింది. డాలరు, ట్రెజరీ ఈల్డ్‌లు గణనీయంగా క్షీణించడంతో పసిడి రెండు నెలల గరిష్టానికి ఎగసిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు.

డాలర్‌ ఇండెక్స్‌ మూడు నెలల కనిష్టానికి పడిపోగా, ట్రెజరీ బాండ్‌ ఈల్డ్‌లు కూడా తగ్గుతుండటం వల్ల బంగారానికి ఆకర్షణీయత పెరిగిందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా స్పాట్‌ మార్కెట్లో పసిడి ఔన్సు (31.1 గ్రాములు) ధర 1.47 శాతం క్షీణించి 4,456.72 డాలర్లకు, వెండి ధర 65.82 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement