
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారతదేశంలో ఓ కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. 'ఫ్లిప్‌కార్ట్ బ్లాక్' పేరుతో ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌కు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌ను రూ.1,499 వార్షిక రుసుముతో సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. అయితే కంపెనీ ముందస్తు తగ్గింపును అందిస్తూ.. ఈ నెలాఖరు లోపల రూ. 990 చెల్లించి సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఇందులో భాగంగానే వినియోగదారులు ఏడాదిపాటు ఫ్రీ యూట్యూబ్ ప్రీమియం యాక్సెస్ పొందవచ్చు. దీనిద్వారా యాడ్స్ లేకుండా వీడియోలు చూడవచ్చు. ఒక సబ్‌స్క్రిప్షన్ ఒక యూట్యూబ్ అకౌంటుకు మాత్రమే పనిచేస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ వీఐపీ స్థానంలో ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ రానుంది. ఫ్లిప్‌కార్ట్ వీఐపీ అనేది సంవత్సరానికి రూ. 799 ఖరీదు చేసే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సర్వీస్. ఇది ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మాదిరిగా కాకుండా.. ప్రత్యేకమైన ఆఫర్‌లను లేదా యూట్యూబ్ ప్రీమియం యాక్సెస్‌ను అందించలేదు.
ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో 2.2 లక్షల సీజనల్ ఉద్యోగాలు
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారు.. సభ్యత్వంతో ప్రతి ఆర్డర్‌పై రూ. 100 వరకు 5 శాతం సూపర్‌కాయిన్స్ క్యాష్‌బ్యాక్ పొందుతారు, అలాగే నెలకు 800 సూపర్‌కాయిన్‌ల వరకు సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. ఈ సూపర్‌కాయిన్‌లను రూపాయికి సమానమైన డిస్కౌంట్‌లుగా లేదా ఆర్డర్‌లపై క్యాష్‌బ్యాక్‌గా రీడీమ్ చేసుకోవచ్చు.