ఈ క్రెడిట్ కార్డు తీసుకుంటే వడ్డీ కట్టక్కర్లేదు

Fintech startup Uni launches interest free credit Pay 1/3rd card - Sakshi

ప్రముఖ ఫిన్‌టెక్‌ స్టార్టప్ కంపెనీ యూని కొత్త రకం సేవలను ప్రారంభించింది. కొత్తగా 'పే 1/3' పేలేటర్ కార్డును తీసుకొనివచ్చింది. ఈ కార్డు ద్వారా మీరు ఏమైనా కొనుగోలు చేస్తే ఆ మొత్తాన్ని మూడు భాగాలుగా ఆటోమేటిక్ గా విభజిస్తుంది. వినియోగదారులు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా మూడు నెలల వ్యవధిలో మూడు భాగాలను చెల్లించాల్సి ఉంటుంది. స్వల్పకాలంలో డబ్బులు కోసం ఎదురుచూసే వినియోగదారుల కోసం ఈ కార్డును తీసుకొచ్చినట్లు సంస్థ ప్రకటించింది. అలా కాకుండా 30 రోజులు తీసుకున్న మొత్తాన్ని చెల్లిస్తే కస్టమర్లకు క్యాష్ బ్యాక్ రూపంలో 1 శాతం రివార్డును అందిస్తున్నట్లు పేర్కొంది.(చదవండి: క్రిప్టోకరెన్సీలో భారత్‌ స్థానం ఎంతో తెలుసా...!)

ఎలాంటి ఛార్జీలు లేవు
'పే 1/3' పేలేటర్ కార్డును తేదీ జూన్ 2021లో పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొచ్చారు. తీసుకొచ్చిన రెండు నెలల కాలంలోనే ఇప్పటికే 10,000 మంది కస్టమర్లు ఈ కార్డును తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. వచ్చే ఏడాదిలోగా 1 మిలియన్ వినియోగదారులను చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. పేలేటర్ కార్డును లాంఛ్ చేయడంపై యూని వ్యవస్థాపకుడు సీఈఓ నితిన్ గుప్తా మాట్లాడుతూ.. "వినియోగదారులను త్వరగా చేరుకోవడం కోసం చెల్లింపు వ్యవదిని మూడు నెలలకు పెంచడం ఉత్తమం అని భావించాము. ఈ కార్డు మా వినియోగదారుల జీవనశైలి ఎంపికగా మార్చాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో ఎలాంటి రహస్య ఛార్జీలు లేకుండా పారదర్శకంగా అందించాలనుకుంటున్నాము. కస్టమర్ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవడంపై ఎక్కువగా దృష్టి సారించాలనుకుంటున్నాము" అని అన్నారు.

ప్రస్తుతం, జాయినింగ్ ఫీజు లేదా వార్షిక ఛార్జీలు లేవు. పే 1/3ర్డ్ యాప్ ద్వారా రియల్ టైమ్ లో వారి ఖర్చులను ట్రాక్ చేయవచ్చు, కేటగిరీల వారీగా చేసిన ఖర్చులను తెలుసుకోవచ్చు. అలాగే తిరిగి చెల్లించే సమయానికి ముందే అలర్ట్ లు వస్తాయి. ఈ కార్డును ‘వీసా కార్డు’ మద్దతుతో తీసుకొస్తున్నారు. దీంతో ఈ కార్డును వీసా కార్డులకు అనుమతి ఉండే ప్రతిచోటా వినియోగించుకోవచ్చు. ఫుడ్‌, గ్రోసరీస్‌, ఈ-కామర్స్‌ సహా పీఓఎస్‌ అందుబాటులో ఉన్న ప్రతిచోటా దీన్ని వినియోగించవచ్చు. అలాగే కస్టమర్లు 6, 9, 12 నుండి 18+ నెలల వరకు ఈఎమ్ఐ ప్లాన్ కూడా ఎంచుకోవచ్చు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top