Layoff Crisis: వేలాదిమందిని తొలగిస్తున్న మరో దిగ్గజ కంపెనీ

Ericsson to trim 1400 jobs more worldwide cost cut amid slowdown - Sakshi

న్యూఢిల్లీ: టెలికా గేర్‌ మేకర్‌, మొబైల్‌ సంస్థ ఎరిక్సన్‌ కూడా ఉద్యోగాల తీసివేతకు నిర్ణయించింది. భారీగా ఖర్చులను తగ్గించుకోవాలని భావిస్తున్న సంస్థ స్వీడన్‌లో దాదాపు1400 మంది,  పలు దేశాల్లో కొంతమంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. అంతేకాదు రాబోయే రోజుల్లో వివిధ దేశాల్లో అనేక వేల ఉద్యోగాల కోతలను ప్రకటించ వచ్చని  అంచనాలు నెలకొన్నాయి. 

ఉత్తర అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ మందగించడంతో 2023 చివరి నాటికి ఖర్చులను 880 మిలియన్‌ డాలర్ల క తగ్గించుకోవాలని యోచిస్తున్నట్లు ఎరిక్సన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యయాలను తగ్గించే విస్తృత ప్రణాళికలో భాగంగానే ఈ తొలగింపులను కంపెనీ పేర్కొంది. 2017లో  ప్రత్యర్థుల  పటీ,  నిర్వహణ వ్యయాలు విపరీతంగా పెరగడంతో  25 వేల మంది ఉద్యోగులను తొలగించి ఎరిక్సన్‌ దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తోంది. ఖర్చుల తగ్గింపును ఎలా నిర్వహించాలనే దానిపై కంపెనీ స్వీడన్‌లోని ఉద్యోగుల సంఘంతో నెలల తరబడి చర్చలు జరుపుతోంది.

సర్వీస్ ప్రొవైడర్లకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT)అందించే ప్రముఖ సంస్థలలో ఎరిక్సన్ ఒకటి. ఎరిక్సన్ ఇటీవల ప్రకటించిన నాల్గవ త్రైమాసిక  ఫలితాల్లో ఊహించిన దానికంటే తక్కువగా లాభాలు నమోదైన నెల తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికా  లాంటి అధిక మార్జిన్ మార్కెట్లలో 5జీ పరికరాల విక్రయాలు మందగించడంతో ఈ  కంపెనీ షేర్లు తాజా కనిష్ట స్థాయిలను తాకాయి. దీంతో కన్సల్టెంట్లు, రియల్ ఎస్టేట్ , ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం లాంటి కాస్ట్‌ కట్‌ చర్యలపై ప్రణాళికలు వేస్తోందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కార్ల్ మెల్లాండర్ వార్తా సంస్థ రాయిటర్స్‌తో చెప్పారు. తాము వివిధ దేశాల కార్మిక చట్టాలను పరిగణనలోకి తీసుకుని యూనిట్లవారీగా తొలగింపు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top