
సామాన్యులకు ఉపశమనం కల్పిస్తూ... ఆయా వంట నూనెల ధరలను రూ.7 నుంచి రూ.20 వరకు కేంద్రం తగ్గించిన విషయం తెలిసిందే. దిగుమతి సుంకాలు భారీగా తగ్గడంతో వంట నూనె ధరలను భారీగా తగ్గాయి. రాబోయే రోజుల్లో వంటనూనె ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాకర్స్ అసోసియేషన్ వెల్లడించింది.
నూనె గింజల మెరుగైన దేశీయ ఉత్పత్తి, ప్రపంచ మార్కెట్లలోని అనుకూల అంశాలతో నూనె ధరలు కిలోకు రూ.3-4 రూపాయలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం నూనెలపై దిగ్గుమతి సుంకాలు తగ్గించడంతో ధరలు తగ్గాయని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అతుల్ చతుర్వేది వెల్లడించారు.
భారీ మొత్తంలో సాగు..!
దేశ వ్యాప్తంగా నూనె గింజల సాగు గణనీయంగా ఉన్నట్లు అతుల్ పేర్కొన్నారు. దేశీయంగా సాగుచేస్తోన్న నూనె గింజలతో వంట నూనె ధరలు మరింత తగ్గనున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వంట నూనె ధరలు కొంతవరకు బేరిష్‌గా ఉండటంతో నూనె ధరలు రేట్లు తగ్గే అవకాశం ఉందన్నారు. ఎస్‌ఈఏ ప్రకారం... భారత్ సుమారు 65 శాతం మేర ఇంపోర్ట్‌పైనే ఆధారపడుతుంది.
చదవండి: ‘అలా చేస్తే ఆర్బీఐకు ఇక్కట్లు తప్పవు..!’