ఎలన్‌ మస్క్‌ తాజా ట్విట్‌ వెనుక అర్థం ఏమిటో..!

Dogecoin Creator Says He Need To Write Cryptic Tweets Like Elon Musk - Sakshi

వాషింగ్టన్‌: టెస్లా, స్పెస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ గురించి తెలియని వారు ఎవరుండరు. అంతరిక్ష రంగంలో రాకెట్ల ప్రయోగంలో రియూసబుల్‌ బూస్టర్లను తిరిగి వాడుతూ రాకెట్‌ ప్రయోగాల  ఖర్చును గణనీయంగా  తగ్గించిన వ్యక్తి ఎలన్‌ మస్క్‌. ఒక చిన్న ట్విట్‌తో కంపెనీల భవిష్యత్తును ఎలన్‌ మార్చగలడు. క్రిప్టో కరెన్సీను అక్సెప్ట్‌ చేస్తూ పలు క్రిప్టోకాయిన్స్‌ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించించాడు. అంతేకాకండా కొద్ది రోజుల ముందే ప్రారంభమైన క్రిప్టో కరెన్సీ డాగీ కాయిన్‌పై ఆసక్తికర ట్విట్ల్‌ చేస్తూ కరెన్సీ విలువ పెరగడంలో మస్క్‌ చర్యలు వివరించలేనిది.

డాగీకాయిన్‌ క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులు ముందుగా ఎలన్‌ మస్క్‌ను డాగీకాయిన్‌ ఫాదర్‌గా పిలుచుకుంటారు. కొన్ని రోజుల క్రితమే..డాగీకాయిన్‌ క్రిప్టోకరెన్సీ లావాదేవీల విషయంలో ఇతర క్రిప్టోకరెన్సీతో పోల్చుకుంటే తక్కువ ఛార్జీలను వసూలు చేస్తోందని ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. దీంతో డాగీకాయిన్‌ క్రిప్టోకరెన్సీ విలువ ఏకంగా ఎనిమిది శాతం లాభాలను చవిచూసింది.

తాజాగా డాగీకాయిన్‌ క్రిప్టోకరెన్సీ  సృష్టికర్త మిచి లుమిన్ తాజాగా తన ట్విట్‌లో..కొన్ని విషయాలను అస్పష్టంగా తెలపాలని, అస్పష్టంగా విషయాలను ​కోడింగ్‌ పద్దతిలో ప్రారంభించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో ప్రజలు కోడెడ్ విషయాలను అర్థం చేసుకొనే స్థాయి వారిలో ఏర్పడుతుందని తెలిపాడు. కాగా కోడిండ్‌ పద్దతిలో ప్రముఖులు షిబెటోషి నకామోటో ,ఎలన్ మస్క్ ఎప్పుడో ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ ట్విట్‌కు ఎలన్‌ మస్క్‌ స్పందిస్తూ..క్రిప్టిక్‌ మ్యానర్‌లో ‘48 61 68 61 20 74 72 75 65’ నంబర్లను ఉంచుతూ ట్విట్‌ చేశారు.

కాగా ఈ ట్విట్‌ అర్ధం ఏమిటా అని నెటిజన్లు తలల పట్టుకున్నారు. కాగా ఈ ట్విట్‌కు అర్థం.. HAHA TRUE అని బేబీ డాగీకాయిన్‌ పేర్కొంది. ఎలన్‌ మస్క్‌ ట్విట్‌లో 48 పోలాండ్‌ కంట్రీ కోర్డ్‌ కాగా, 61 పోజానన్‌ సీటిలో కొత్తగా టెస్లా లాజిస్టిక్‌ పార్కును సెట్టప్‌ చేయనుందా..అని ఒక నెటిజన్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్విట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top