breaking news
codeing
-
ఎలన్ మస్క్ తాజా ట్విట్ వెనుక అర్థం ఏమిటో..!
వాషింగ్టన్: టెస్లా, స్పెస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ గురించి తెలియని వారు ఎవరుండరు. అంతరిక్ష రంగంలో రాకెట్ల ప్రయోగంలో రియూసబుల్ బూస్టర్లను తిరిగి వాడుతూ రాకెట్ ప్రయోగాల ఖర్చును గణనీయంగా తగ్గించిన వ్యక్తి ఎలన్ మస్క్. ఒక చిన్న ట్విట్‌తో కంపెనీల భవిష్యత్తును ఎలన్ మార్చగలడు. క్రిప్టో కరెన్సీను అక్సెప్ట్ చేస్తూ పలు క్రిప్టోకాయిన్స్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించించాడు. అంతేకాకండా కొద్ది రోజుల ముందే ప్రారంభమైన క్రిప్టో కరెన్సీ డాగీ కాయిన్‌పై ఆసక్తికర ట్విట్ల్ చేస్తూ కరెన్సీ విలువ పెరగడంలో మస్క్ చర్యలు వివరించలేనిది. డాగీకాయిన్ క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులు ముందుగా ఎలన్ మస్క్‌ను డాగీకాయిన్ ఫాదర్‌గా పిలుచుకుంటారు. కొన్ని రోజుల క్రితమే..డాగీకాయిన్ క్రిప్టోకరెన్సీ లావాదేవీల విషయంలో ఇతర క్రిప్టోకరెన్సీతో పోల్చుకుంటే తక్కువ ఛార్జీలను వసూలు చేస్తోందని ఎలన్ మస్క్ ట్విటర్లో పేర్కొన్నారు. దీంతో డాగీకాయిన్ క్రిప్టోకరెన్సీ విలువ ఏకంగా ఎనిమిది శాతం లాభాలను చవిచూసింది. తాజాగా డాగీకాయిన్ క్రిప్టోకరెన్సీ సృష్టికర్త మిచి లుమిన్ తాజాగా తన ట్విట్లో..కొన్ని విషయాలను అస్పష్టంగా తెలపాలని, అస్పష్టంగా విషయాలను కోడింగ్ పద్దతిలో ప్రారంభించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో ప్రజలు కోడెడ్ విషయాలను అర్థం చేసుకొనే స్థాయి వారిలో ఏర్పడుతుందని తెలిపాడు. కాగా కోడిండ్ పద్దతిలో ప్రముఖులు షిబెటోషి నకామోటో ,ఎలన్ మస్క్ ఎప్పుడో ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ ట్విట్‌కు ఎలన్ మస్క్ స్పందిస్తూ..క్రిప్టిక్ మ్యానర్‌లో ‘48 61 68 61 20 74 72 75 65’ నంబర్లను ఉంచుతూ ట్విట్ చేశారు. కాగా ఈ ట్విట్ అర్ధం ఏమిటా అని నెటిజన్లు తలల పట్టుకున్నారు. కాగా ఈ ట్విట్‌కు అర్థం.. HAHA TRUE అని బేబీ డాగీకాయిన్ పేర్కొంది. ఎలన్ మస్క్ ట్విట్లో 48 పోలాండ్ కంట్రీ కోర్డ్ కాగా, 61 పోజానన్ సీటిలో కొత్తగా టెస్లా లాజిస్టిక్ పార్కును సెట్టప్ చేయనుందా..అని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 48 61 68 61 20 74 72 75 65 — Elon Musk (@elonmusk) July 14, 2021 HAHA TRUE 🤫😂 pic.twitter.com/02IjOaSaOY — Baby Doge Coin (@BabyDogeCoin) July 14, 2021 -
కోడింగ్‌లో తప్పు.. కంపెనీ కొలాప్స్
లండన్: ప్రోగ్రామ్ కోడింగ్‌లో ఒక వ్యక్తి అనుకోకుండా రాసిన తప్పు అతని సొంత కంపెనీయే నాశనమయ్యేలా చేసింది. ఆ తప్పుడు కోడ్ వల్ల అతని కంప్యూటర్లలోని డేటాతోపాటు, దాదాపు 1535 క్లైంట్ల వెబ్‌సైట్‌ల్లోని సమాచారం డెలీట్ అయింది. సర్వర్‌లో కోడింగ్ సమయంలో విలువైన డేటా విడిగా ఉండేలా వేరియబుల్‌ను నిర్వచించకపోవడమే ఇందుకు కారణం. లండన్‌లో వెబ్ హోస్టింగ్ సంస్థను నడుపుతున్న మార్కో మార్సాలా అనే వ్యక్తి సర్వర్ కంప్యూటర్లో పొరపాటున ’rm -rf’ అనే తప్పుడు కోడ్ రాశాడు. సాధారణంగా డిలీట్ చే స్తున్నపుడు వార్నింగ్ నోటిఫికేషన్ వస్తుంది. కోడ్‌లో ఆ వేరియబుల్‌ను నిర్వచించకపోవడం వల్ల ఎలాంటి నోటిఫికేషన్ రాకుండానే, బ్యాకప్‌తో సహా అన్ని ఫైళ్లు డెలీట్ అయిపోయాయి.