కోడింగ్‌లో తప్పు.. కంపెనీ కొలాప్స్‌ | This man deleted his entire company with one line of wrong code | Sakshi
Sakshi News home page

కోడింగ్‌లో తప్పు.. కంపెనీ కొలాప్స్‌

Apr 16 2016 9:39 AM | Updated on Sep 3 2017 10:04 PM

కోడింగ్‌లో తప్పు.. కంపెనీ కొలాప్స్‌

కోడింగ్‌లో తప్పు.. కంపెనీ కొలాప్స్‌

ప్రోగ్రామ్‌ కోడింగ్‌లో ఒక వ్యక్తి అనుకోకుండా రాసిన తప్పు అతని సొంత కంపెనీయే నాశనమయ్యేలా చేసింది.

లండన్‌: ప్రోగ్రామ్‌ కోడింగ్‌లో ఒక వ్యక్తి అనుకోకుండా రాసిన  తప్పు అతని సొంత కంపెనీయే నాశనమయ్యేలా చేసింది. ఆ తప్పుడు కోడ్‌ వల్ల అతని కంప్యూటర్లలోని డేటాతోపాటు, దాదాపు 1535 క్లైంట్ల వెబ్‌సైట్‌ల్లోని సమాచారం డెలీట్‌ అయింది. సర్వర్‌లో కోడింగ్‌ సమయంలో విలువైన డేటా విడిగా ఉండేలా వేరియబుల్‌ను నిర్వచించకపోవడమే ఇందుకు కారణం.

 

లండన్‌లో వెబ్‌ హోస్టింగ్‌ సంస్థను నడుపుతున్న మార్కో మార్సాలా అనే వ్యక్తి సర్వర్‌ కంప్యూటర్‌లో పొరపాటున ’rm -rf’ అనే  తప్పుడు కోడ్‌ రాశాడు. సాధారణంగా డిలీట్‌ చే స్తున్నపుడు వార్నింగ్‌ నోటిఫికేషన్‌ వస్తుంది. కోడ్‌లో ఆ వేరియబుల్‌ను నిర్వచించకపోవడం వల్ల ఎలాంటి నోటిఫికేషన్‌ రాకుండానే, బ్యాకప్‌తో సహా అన్ని ఫైళ్లు డెలీట్‌ అయిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement