మూడు రోజుల్లో 795 ఫ్లాట్లు అమ్మిన డీఎల్‌ఎఫ్‌.. ఎక్కడంటే.. | Sakshi
Sakshi News home page

మూడు రోజుల్లో 795 ఫ్లాట్లు అమ్మిన డీఎల్‌ఎఫ్‌.. ఎక్కడంటే..

Published Thu, May 9 2024 11:51 AM

DLF sold 795 apartments in its new luxury housing project with in three days in Gurugram

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్‌ఎఫ్‌ మూడు రోజుల్లోనే గురుగ్రామ్‌లో రూ.5,590 కోట్ల విలువైన 795 లగ్జరీ ఫ్లాట్లు విక్రయించింది. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం..డీఎల్‌ఎఫ్‌ గురుగ్రామ్‌లో 'డీఎల్‌ఎఫ్‌ ప్రివానా వెస్ట్' అనే కొత్త ప్రాజెక్ట్‌ ప్రారంభించింది. ఇందులో భాగంగా లగ్జరీ ఫ్లాట్‌లను నిర్మించారు.

ఫ్లాట్ల అమ్మకాలు ప్రారంభించిన మూడు రోజుల్లోనే మొత్తం 795 ఫ్లాట్‌లు విక్రయించారు. వాటి విలువ రూ.5,590 కోట్లుగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను 116 ఎకరాల డీఎల్‌ఎఫ్‌ టౌన్‌షిప్‌లో భాగంగా 12.57 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సంస్థ గతంలో ప్రివానా సౌత్‌లో నిర్మించిన 1,113 ఫ్లాట్లను మూడురోజుల్లో విక్రయించి రూ.7,200 కోట్లు సమకూర్చుకుంది.

ఇదీ చదవండి: సిక్‌ లీవ్‌ తీసుకున్న ఉద్యోగుల తొలగింపు

డీఎల్‌ఎఫ్‌ హోమ్ డెవలపర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్‌ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాష్ ఓహ్రి మాట్లాడుతూ..ఫ్లాట్ల విక్రయానికి సంబంధించి వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చినట్లు సంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని ఎక్కువగా ఎన్‌ఆర్‌ఐలే కొనుగోలు చేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement