47 అంతస్తుల కో లీవింగ్‌ ప్రాజెక్ట్‌.. ఇండియాలోనే అతి పెద్దది.. ఎక్కడంటే?

Details about Indias First co living space Project Under Construction In Hyderabad - Sakshi

ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం జనాలు మెట్రో నగరాలకు వెళ్తున్నారు. వీరిలో చాలా మంది హస్టళ్లలో ఉంటున్నారు. లేదంటే ఇళ్లు అద్దెకు తీసుకుంటారు. ఖర్చు పెట్టే స్థోమత ఉన్నా ఫ్యామిలీ టైప్‌ సెక్యూరిటీతో అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్లు లభించడం కష్టం. ఇలాంటి వారి కోసం లగ్జరీ కో లివింగ్‌ ప్రాజెక్టును మన హైదరాబాద్‌లో చేపడుతున్నారు. 

కో లివింగ్‌కి 5 ఫ్లోర్లు
నగరంలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఈ భారీ కో లివింగ్‌ ప్రాజెక్టు నిర్మాణానికి రేరా నుంచి అనుమతులు వచ్చాయి. మొత్తం 47 అంతస్థులతో హైదరాబాద్‌ వన్‌ పేరుతో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో 41 అంతస్థులు రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్లకు కేటాయించగా 5 అంతస్థులను కేవలం కోలివింగ్‌ కోసమే కేటాయిస్తున్నారు. మిగిలిన ఫ్లోర్‌లో స్విమ్మింగ్‌పూల్‌, సెవెన్‌స్టార్‌ బార్‌, జిమ్‌ , కేఫ్‌టేరియా ఇతర సౌకర్యాల కోసం ఉపయోగించనున్నారు.

కేవలం మహిళలకే
త్వరలో అందుబాటులోకి రాబోయే ఈ భవనంలో ఐదు అంతస్థులు కోలివింగ్‌కి కేటాయించారు. అయితే కో లివింగ్‌ ఫెసిలిటీని కేవలం మహిళలకే కేటాయించారు. ప్రతీ గదిలో ఇద్దరు మహిళలు ఉండవచ్చు. గది వైశాల్యం 397 చదరపు అడుగుల నుంచి 546 చదరపు అడుగుల వరకు ఫుల్‌ ఫర్నీచర్‌ ఎక్విప్‌మెంట్‌తో ఉంటాయని నిర్మాణ సంస్థ చెబుతుంది. వీటికి నెలవారీ అద్దె రూ. 26,000ల నుంచి రూ. 36,000 రేంజ్‌లో ఉండవచ్చని అంచనా. 

ఫుల్‌ వెరిఫికేషన్‌
బ్యాక్‌గ్రౌండ్‌ ఫుల్‌ వెరిఫికేషన్‌ పూర్తైన వారినే కోలివింగ్‌కి అనుమతి ఇస్తామని నిర్మాణ సంస్థ చెబుతోంది. ప్రతీ రూమ్‌లో పానిక్‌ బటన్‌ అందుబాటులో ఉంటుందని హామీ ఇస్తోంది. రిలీజియన్‌, జెండర్‌, క్యాస్ట్‌ తదితర వివక్ష పాటించని వారకే ఇందులో అనుమతి అని చెబుతోంది. ఈ భారీ భవనంలో ఎవరైనా డ్రగ్‌ వంటి మత్తు పదార్థాలు వాడుతున్నట్టు సమాచారం అందిస్తే నజరానా కూడా అందిస్తామంటోంది.

2026 నాటికి
హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు ఎక్కువగా విస్తరించిన ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలో రూ. 1500 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. 2026 చివరి నాటికి 47 అంతస్థుల భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హెచ్‌ 1 పేరుతో నిర్మిస్తున్న ఈ భవనం 160 మీటర్ల ఎత్తుతో ఉండబోతుంది. ప్రపంచంలోనే కోలీవింగ్‌కి సంబంధించి ఇదే అతి పెద్దదని నిర్మాణ సంస్థ అంటోంది.

యూకే తరహాలో
కోలివింగ్‌ కోసం ప్రత్యేకంగా భవనాలు నిర్మించే ట్రెండ్‌ ప్రస్తుతం యూకేలో ఎక్కువగా ఉందని. ఇండియాలో హైదరాబాద్‌తో ఈ ట్రెండ్‌ రానుందని నిర్మాణ కంపెనీ అంటోంది. ఐటీ, ఫార్మా సెక్టార్‌లో దూసుకుపోతున్న హైదరాబాద్‌కి దేశం నలుమూలల నుంచి యువత వస్తున్నారు. హై పెయిడ్‌ ఎంప్లాయిస్‌ సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. అయితే వీరికి సకల సౌకర్యాలు, సెక్యూరిటీ కూడిన లివింగ్‌ స్పేస్‌ కొరత ఉంది. హెచ్‌ 1 ఈ కొరత తీరుస్తుందని నిర్మాణ కంపెనీ అంటోంది. 

చదవండి: 40 అంతస్థుల జంట భవనాలు కూల్చేస్తారా లేక జైళ్లో పెట్టమంటారా ?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top