ఎగుమతుల ప్రోత్సాహకానికి సమావేశాలు

Commerce ministry to organise workshops on promoting exports - Sakshi

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ ద్వారా ఎగుమతులను ప్రోత్సహించే మార్గాలపై అవగాహన పెంచేందుకు నెలవారీ వర్క్‌షాప్‌లను నిర్వహించాలని నిర్ణయించినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. వర్క్‌షాప్‌ల ద్వారా విదేశాలకు సరుకు రవాణా, పోస్టల్, కస్టమ్స్‌ సమ్మతి, చెల్లింపులకు  సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తారు.

ప్రతిపాదిత వర్క్‌షాప్‌లు ప్రతి నెల మొదటి వారంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహిస్తారు. సాధ్యమయ్యే చోట వ్యక్తిగతంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అనుభవాలను పంచుకోవడానికి, కొత్త వ్యవస్థాపకులకు సలహా ఇవ్వడానికి ప్రముఖ ఈ–కామర్స్‌ ఎగుమతిదారులను ఆహా్వనించినట్టు వెల్లడించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top