రూ.46.90 లక్షల కారు లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - పూర్తి వివరాలు | Sakshi
Sakshi News home page

రూ.46.90 లక్షల కారు లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - పూర్తి వివరాలు

Published Thu, May 23 2024 7:12 PM

BMW 2 Series Shadow Edition Launched In India Price Features And More

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారతదేశంలో 2 సిరీస్ షాడో ఎడిషన్‌ను రూ. 46.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ షాడో ఎడిషన్ 220ఐ ఎం స్పోర్ట్స్ అనే ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. ఇది బ్లాక్ అవుట్ ఎక్స్‌టీరియర్ ఎలిమెంట్స్‌తో సూక్ష్మమైన అప్‌డేట్‌లను పొందుతుంది.

బీఎండబ్ల్యూ షాడో ఎడిషన్ బ్లాక్ ఎడిషన్ కిడ్నీ గ్రిల్, అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌, రియర్ స్పాయిలర్ వంటి వాటితో పాటు.. ఆధునిక ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెట్ సిస్టం, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మొదలైనవి ఉన్నాయి.

ఆల్పైన్ వైట్, స్కైస్క్రాపర్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 179 హార్స్ పవర్ మరియు 280 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ముందు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 7.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

కొత్త బీఎండబ్ల్యూ 2 సిరీస్ షాడో ఎడిషన్‌.. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా పొందుతుంది. ఇది 190 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటో గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement