Multibagger: పెట్టుబడి లక్ష.. లాభం రూ.4 కోట్లు.. ఇన్వెస్టర్ల ఇంట లాభాల పంట | Blue Foam Logistics Stocks Gived Investors Huge Profits In two Years | Sakshi
Sakshi News home page

Multibagger: పెట్టుబడి లక్ష.. లాభం రూ.4 కోట్లు.. ఇన్వెస్టర్ల ఇంట లాభాల పంట

Nov 13 2021 2:04 PM | Updated on Nov 13 2021 4:50 PM

 Blue Foam Logistics Stocks Gived Investors Huge Profits In two Years - Sakshi

షేర్‌ మార్కెట్‌ అనగానే సెన్సెక్స్‌ 30, నిఫ్టీ 50 సూచీల కదలికపైనే అందరు దృష్టి సారిస్తారు. మార్కెట్‌లో బ్లూచిప్‌ కేటగిరలో ఉన్న బిగ్‌ కంపెనీల పనితీరు, ఆయా కంపెనీల్లో షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు చూపుతున్న ఆసక్తిని ఈ సూచీలు పట్టి చూపుతాయి. కానీ మార్కెట్‌లో అనామకంగా స్మాల్‌ క్యాప్‌ కేటగిరిలో ఉన్న అనేక స్టాక్స్‌ ఊహించని లాభాలను అందిస్తాయి. మార్కెట్‌పై సరైన విశ్లేషణ చేసి ఈ కంపెనీల స్టాక్స్‌ కొంటే లాభల పంట పండటం కాదు కుంభవృష్టి కురుస్తుంది.  

ఫ్లోమిక్‌ గ్లోబల్‌ లాజిస్టిక్‌
స్టాక్‌ మార్కెట్‌లో స్మాల్‌క్యాప​ కేటగిరిలో లిస్టయిన కంపెనీల్లో ఫ్లోమిక్‌ గ్లోబల్‌ లాజిస్టిక్‌ ఒకటి. రెండేళ్ల క్రితం వరకు ఈ కంపెనీ గురించి పట్టించుకున్న వాళ్లే లేరు. కానీ ఈ రోజు ఈ కంపెనీ షేర్లు అందించిన లాభాలు చూసి మార్కెట్‌ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. అనతి కాలంలో సంక్షోభ సమయంలో భారీ లాభాలు అందించిన షేర్లుగా అందరి నోళ్లలో ఫ్లోమిక్‌ గ్లోబల్‌ పేరు నానుతోంది.

రెండేళ్ల కిందట
ఫ్లోమిక్‌ గ్లోబల్‌ లాజిస్టిక్‌ కంపెపీ 2019 మార్చి 28న మార్కెట్‌లో లిస్టయ్యింది. ఆ సమయంలో ఆ కంపెనీ షేరు విలువ కేవలం 35 పైసలు మాత్రమే. స్మాల్‌క్యాప్‌ కేటగిరిలో ఉన్న ఈ కంపెనీ షేర్లు కొనేందుకు ఆసక్తి చూపించిన వారు చాలా అరుదు అనే పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత కరోనా సంక్షోభం లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో ఈ కంపెనీ షేర్లలో పెరుగుదల కనిపించలేదు. గతేడాది నవంబరు మొదటి వారంలో ఈ కంపెనీ షేరు విలువ కేవలం రూ.1.14గా నమోదు అయ్యింది. 

ఇలా పట్టుకున్నారు
సాధారణంగా మార్కెట్‌లో బ్లూ చిప్‌ కంపెనీల షేర్ల ధర ఎక్కువగా ఉంటుంది. మార్కెట్‌లో వీటి ధర కూడా ఎక్కువగా ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటుంది. స్మాల్‌క్యాప్‌ షేర్లు ఇందుకు విరుద్దంగా తక్కువ ధరకే లభిస్తుంటాయి. అయితే తెలివైన ఇన్వెస్టర్లు మంచి ఫలితాలు సాధించే స్మాల్‌క్యాప్‌ కంపెనీలను ఇట్టే పట్టుకుంటారు. ఏడాదిలో ఫ్లోమిక్‌ గ్లోబల్‌ లాజిస్టిక్‌ కంపెనీ షేరు విలువ 25 పైసల నుంచి రూ.1.14కి చేరుకుంది. అంటే ఇంచుమించు మూడు వందల శాతం వృద్ధి నమోదు చేసింది. దీంతో  మంచి వృద్ది కనబరుస్తూ తక్కువ ధరకే లభిస్తున్న ఫ్లోమిక్‌ గ్లోబల్‌ లాజిస్టిక్‌పై ఇన్వెస్టర్లు ఫోకస్‌ చేయడం మొదలు పెట్టారు. 

అంచనాలను మించి
ఇన్వెస్టర్లు ఫ్లోమిక్‌ లాజిస్టిక్‌ షేర్లపై ఆసక్తి చూపించడంతో ఈ ఏడాది ఆరంభం నుంచి క్రమంగా షేర్ల ధర పెరుగుతూ 2021 జులైకి వచ్చే సరికి రూ.12.24 పైసులకు చేరుకుంది. ఇన్వెస్టర్లకు రూపాయికి పది రూపాయల లాభం ఇచ్చిన షేరుగా మార్కెట్‌లో గుర్తింపు పొందింది. అంతే ఇక అక్కడి నుంచి ఆకాశమే హద్దుగా ఈ కంపెనీ షేర్లు పెరుగుతూ వస్తున్నాయి. నవంబరు 13న ఈ కంపెనీ షేర్లు రూ.143.25గా ట్రేడవుతోంది. కేవలం ఆరు నెలల్లో కంపెనీ షేర్లు 1,779 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

లాభాలే లాభాలు
నవంబరు మొదటి వారంలో ఈ కంపెనీ షేర్లు రూ.1.22లుగా ఉండగా నేడు రూ.143.25గా ఉంది. అంటే ఏడాది కిందట ఈ కంపెనీ షేర్లపై లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ఏడాది తిరిగే సరికి దాదాపు కోటిన్నర రూపాయల రిటర్న్‌లు వచ్చినట్టయ్యింది. ఆరు నెలల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్ట్‌ చేసిన వారు సైతం కనిస్టంగా కోటి రూపాయల వరకు లాభం కళ్ల జూశారు. ఇక అక్టోబరు 27న అయితే ఈ కంపెనీ ఆల్‌టైం హై ధర రూ.216ని టచ్‌ చేసింది. ఆ రోజు షేర్లు అమ్ముకున్నవారికి అయితే ఏకంగా లక్షకు రెండు కోట్ల రూపాయల వరకు రిటర్నులు వచ్చాయి. ఇక రెండేళ్ల క్రితం కంపెనీ ఆరంభంలో లక్ష పెట్టుబడి పెట్టిన వారికి అయితే ఏకంగా నాలుగు కోట్ల రూపాయలకు పైగా రిటర్న్స్‌ వచ్చాయి. 
చదవండి:మదుపరులపై కాసుల వర్షం కురిపించిన స్టాక్స్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement