మదుపరులపై కాసుల వర్షం కురిపించిన స్టాక్స్! | Mastek Ltd Stock Turned Into a multibagger in over 18 Months | Sakshi
Sakshi News home page

మదుపరులపై కాసుల వర్షం కురిపించిన స్టాక్స్!

Nov 12 2021 5:23 PM | Updated on Nov 12 2021 8:57 PM

Mastek Ltd Stock Turned Into a multibagger in over 18 Months - Sakshi

కరోనా మహమ్మారి తర్వాత చాలా మందికి డబ్బు విలువ తెలిసి వచ్చింది. మన పెద్దలు చెప్పినట్లు ఎంతో కొంత పెట్టుబడి పెట్టేందుకు సిద్దం అవుతున్నారు. పెట్టుబడి మార్గాలలో ఒకటైన స్టాక్‌మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అక్కడుండే రిస్క్‌ పట్ల చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. అందువల్లే డీమమ్యాట్‌ ఖాతాలు పెరుగుతున్న తీరుకు మార్కెట్‌లోకి వస్తున్న పెట్టుబుడులకు మధ్య పొంతన ఉండటం లేదు. కానీతక్కువ పెట్టుబడితో మంచి పోర్ట్‌ఫోలియో రెడీ చేసుకుంటే మార్కెట్‌పై అవగాహన వస్తుందని తద్వారా సక్సెస్‌ రూట్‌లో వెళ్లొచ్చని నిపుణులు అంటున్నారు. 

అందుకే తగ్గట్లే చిన్న, చిన్న కంపెనీలు కూడా అధిక మొత్తంలో రిటర్న్స్ ఇస్తున్నాయి. తాజాగా, ఇటీవల ఒక కంపెనీ వారి కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారికి 16 రేట్లు అధిక మొత్తంలో లాభాలు వచ్చాయి. ఆ కంపెనీ పేరు మాసెక్ లిమిటెడ్(Mastek Ltd Stock). ఈ కంపెనీ స్టాక్ 1.5 సంవత్సరాలలో 1600% పైగా పెరిగింది. మార్చి 27, 2020న రూ.172.35 వద్ద ముగిసిన ఈ స్టాక్ ధర నేడు రూ.2,871 గరిష్టానికి పెరిగింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎస్ఈ)లో 1,565 శాతం పెరిగింది.


గత ఏడాది మార్చి 27న మాస్టెక్ షేర్లలో 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన మదుపరులకు ఈ రోజు రూ.16.65 లక్షలు వచ్చేవీ. అది అలా ఉంటే చాలా మంది సామాన్య ప్రజానీకం స్టాక్ మార్కెట్ కొంచెం వెనుకడుగు వేస్తున్నారు. ఎందులోనైనా ఎంత కొంత రిస్క్ అనేది ఉంటుంది. ఇందులో కాస్త ఎక్కువ, కానీ ఈ మార్కెట్ పై ఒకసారి గనుక పట్టు సాధిస్తే ఏడాదిలో కోటీశ్వర్లు అయిపోవచ్చు.
(చదవండి: టెస్లాకి షాకిచ్చిన పోర్షే... ఇండియా మార్కెట్‌లోకి లగ్జరీ ఎలక్ట్రిక్‌ కారు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement