Bajaj Electricals Q2 results Net profit up 18 percent- Sakshi
Sakshi News home page

బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ లాభం అప్‌

Nov 13 2021 10:25 AM | Updated on Nov 13 2021 10:37 AM

Bajaj Electricals Q2 results Net profit up 18 percent - Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ ఈ ఆర్థికసంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం 18 శాతం ఎగసి రూ. 63 కోట్లకు చేరింది.


గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 53 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 7 శాతం పుంజుకుని రూ. 1,302 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు 8 శాతం పెరిగి రూ. 1,244 కోట్లకు చేరా యి. కన్జూమర్‌ ప్రొడక్టుల విభాగం ఆదాయం 31 శాతం జంప్‌చేసి రూ. 1035 కోట్లను తాకగా.. ఈపీసీ బిజినెస్‌ 37 శాతం క్షీణించి రూ. 267 కోట్లకు పరిమితమైంది. 

బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ షేరు బీఎస్‌ఈలో 1 శాతం నీరసించి రూ. 1,092 వద్ద ముగిసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement