
ఆసియా కప్2023లో భారత ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ సిరాజ్ హీరోగా మారిపోయాడు. హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మొహమ్మద్ సిరాజ్ వీరవిహారంతో శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత జట్టు సభ్యుడిగా టైటిల్ సాధించడంలో మియాన్ మ్యాజిక్ చేయడం మాత్రమే కాదు తన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 5000డాలర్ల ప్రైజ్ మనీని కొలంబో గ్రౌండ్ స్టాఫ్‌కి విరాళంగా ప్రకటించి మరింత ఎత్తుకు ఎదిగాడు. దీంతో సిరాజ్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో పారిశ్రామిక వేత్త, ఎం అండ్ అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు. నువ్వు క్లాస్ బాసూ అన్న రీతిలో స్పందించారు. ‘‘ఒకటే మాట.. క్లాస్.. అంతే .. ఈ క్లాస్ అనేది ఇది మీ సంపద లేదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు. మీ బ్యాక్ గ్రౌండ్ అనే దాన్నుంచి రాదు.. అది మీలోనే ఉంటుంది’’ అంటూ ట్విట్ చేశారు.
2021లో మహీంద్ర థార్ గిఫ్ట్
ఇదే మ్యాచ్‌లో సిరాజ్ వన్ మ్యాన్ షోపై కూడా ఆనంద్ మహీంద్ర స్పందించారు. అయితే ఈ రైజింగ్ స్టార్‌కు దయచేసి ఎస్‌యూవీ ఇచ్చేయండి సార్ అంటూ ఒక యూజర్ కోరగా, 2021లో మహీంద్రా థార్ ఇచ్చిన సంగతిని గుర్తుచేస్తూ బదులిచ్చారు.
కాగా ఆసియా కప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ విజేతగా నిలిచాన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో సిరాజ్ ఒకే ఓవర్‌లో 4 వికెట్లు, 10 బంతుల వ్యవధిలో 5 వికెట్లు సాధించడం అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
Just one word: CLASS.
— anand mahindra (@anandmahindra) September 17, 2023
It doesn’t come from your wealth or your background. It comes from within…. https://t.co/hi8X9u4z1O