టీవీఎస్‌తో జతకట్టిన అమెజాన్‌ ఇండియా.. 2025 నాటికి అదే టార్గెట్‌! | Amazon India Partners TVS For Electric Vehicles, To Deploy 10000 Ev By 2025 | Sakshi
Sakshi News home page

టీవీఎస్‌తో జతకట్టిన అమెజాన్‌ ఇండియా.. 2025 నాటికి అదే టార్గెట్‌!

Nov 9 2022 8:17 PM | Updated on Nov 9 2022 8:17 PM

Amazon India Partners TVS For Electric Vehicles, To Deploy 10000 Ev By 2025 - Sakshi

భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సేవలను బలోపేతం చేయడానికి టీవీఎస్ మోటార్ కంపెనీ అమెజాన్ ఇండియాతో చేతులు కలిపింది. వివిధ అమెజాన్ నెట్‌వర్క్, లాజిస్టిక్స్ విభాగాలలో ఈవీ(EV) వినియోగ కేసులను పరిశీలించడానికి ఈ రెండు కంపెనీలు కలిసి పని చేయనున్నాయి.

పారిస్ ఒప్పందానికి ప్రకారం 2040 నాటికి జీరో కార్బన్‌ను సాధించాలనే నిబద్ధతలో భాగంగా అమెజాన్‌ ఈ ప్రయత్నాలను చేస్తోంది. అందుకోసం  2025 నాటికి 10,000 ఈవీలను డెలివర్‌ చేసే దిశగా అమెజాన్ ఇండియా ప్లాన్‌ చేస్తోంది. టీవీఎస్‌ మోటార్ కంపెనీ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఎనిమిది త్రైమాసికాల వ్యవధిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర,  త్రీ-వీలర్ల వాహనాల పూర్తి పోర్ట్‌ఫోలియోను మార్కెట్లో విడుదలకు సన్నాహాలు చేస్తోంది. తద్వారా భారత్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో కంపెనీ తన ఉనికిని విస్తరించడంతో పాటు బలోపేతం చేయాలని భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement