బంపరాఫర్.. రూ.149కే 15 ఓటీటీ ప్లాట్‌పామ్స్ సబ్‌స్క్రిప్షన్!

Airtel Is Offering Major Ott Benefits With This Plan Under Rs 200 - Sakshi

దేశీయ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ యూజర్లకు బంపరాఫర్‌ ప్రకటించింది. అతి తక్కువ ప్రీపెయిడ్‌ ప్లాన్‌కే 15 రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను వీక్షించే అవకాశం కల్పించింది. ఎయిర్‌టెల్‌ ఇటీవల ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌లో మార్పులు చేసింది. మార్పులకు అనుగుణంగా యూజర్లు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వారికి నచ్చిన ప్రోగ్రామ్స్‌ చూసి ఎంజాయ్‌ చేయొచ్చని ఎయిర్‌టెల్‌ తెలిపింది. 

రూ.200 లోపే 
ఎయిర్‌టెల్‌ రూ.149తో 1జీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా ఒకే యాప్‌లో 15 రకాల ఓటీటీలను వీక్షించవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్‌ డేటా వోచర్‌తో పాటు ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌లో ఇతర అన్నీ రకాల బెన్ఫిట్స్‌ పొందవచ్చు. ఒక్క స్మార్ట్‌ఫోన్‌లోనే కాదు.. టీవీ, పీసీల్లోనూ యాప్‌కు యాక్సెస్‌ చేసుకునే సౌలభ్యం ఉంది. 

ఇవే ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌
ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌లో సోనీలివ్‌, లయన్స్‌గేట్‌ప్లే, హొయ్‌చొయ్‌, చౌపల్‌, కచ్చాలంకా, ఈరోస్‌నౌ, మనోరమామ్యాక్స్‌, హంగామా, డాక్యూబే వంటి ఓటీటీ కంటెంట్‌ను వీక్షించవచ్చు
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top