
టెక్ కంపెనీల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది లేఆఫ్స్‌కు బలవుతున్నారు. ఒకే కంపెనీలో 25 ఏళ్లు పని చేసిన 57 ఏళ్ల ఓ వ్యక్తికి లేఆఫ్ ప్రకటించడంతో ఇందుకు సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇన్నేళ్లు సంస్థలో పని చేసిన ఆ ఉద్యోగి ఊహించని షాక్‌కు గురైనట్లు రెడిట్ పోస్ట్‌లో చెప్పుకొచ్చారు.
రెడిట్ పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. ‘నా వయసు 57 ఏళ్లు. ఒకే కంపెనీలో గత 25 ఏళ్లుగా వివిధ స్థాయుల్లో పనిచేస్తూ ప్రస్తుతం హైరింగ్ మేనేజర్‌గా ఉన్నాను. నా రిటైర్మెంట్‌కు ఇంకా కొన్ని నెలల సమయమే ఉంది. కంపెనీ సడెన్‌గా నాకు లేఆఫ్ ఇస్తున్నట్లు చెప్పింది. ఇది నాకు ఊహించని షాక్. సంస్థ 30 రోజుల నోటీసు పీరియడ్ విధించింది. నన్ను 2-3 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగిగా పరిగణిస్తున్నట్లు అనిపించింది. చాలా వింతగా అనిపిస్తుంది’ అని రాసుకొచ్చారు.
ఆ ఉద్యోగి తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేశాడు. రెజ్యూమెను కస్టమైజ్ చేశాడు. తన పనికి తగినట్లు కాకపోయినా నెలకు రూ.80వేలు–రూ.1లక్ష వేతనం ఉన్న ఉద్యోగం కోసం చూస్తున్నట్లు చెప్పాడు. అతని ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉందని, తక్కువ ఖర్చులతో తన భార్య ఇంటి వ్యవహారాలను చూసుకుంటోందని తెలిపారు. దీనిపై రెడ్డిట్ వినియోగదారులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఇప్పుడు ఇదే ఆనవాయితీ..’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘సుదీర్ఘ పదవి విరామం కోసం మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉండండి’ అని మరొకరు రిప్లై ఇచ్చారు.
ఇదీ చదవండి: లేఆఫ్స్‌కు వ్యతిరేకమంటూ 4000 మంది ఉద్యోగాల కోత