
హురున్ ఇండియా 2025లో అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాను విడుదల చేసింది. ఇందులో అంబానీ ఫ్యామిలీ మళ్ళీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ కుటుంబ వ్యాపార విలువ రూ. 28.2 లక్షల కోట్లు. ఇది భారతదేశ జీడీపీలో పన్నెండవ వంతు. ఆ తరువాత జాబితాలో కుమార్ మంగళం బిర్లా కుటుంబం ఉంది. వీరి ఫ్యామిలీ బిజినెస్ వాల్యూ రూ. 1.1 లక్షల కోట్లు పెరిగి రూ. 6.5 లక్షల కోట్ల విలువకు చేరుకుంది. మూడో స్థానంలో జిందాల్ కుటుంబం (రూ. 5.7 లక్షల కోట్లు) ఉంది.
భారతదేశంలో అత్యంత విలువైన కుటుంబాల జాబితాలో నిలిచిన మొదటి మూడు ఫ్యామిలీల విలువ రూ. 40.4 లక్షల కోట్లు. ఇది ఫిలిప్పీన్స్ జీడీపీకి సమానం అని తెలుస్తోంది.
భారతదేశంలోని టాప్ 10 ధనిక కుటుంబాలు
➤అంబానీ కుటుంబం: రూ. 28,23,100 కోట్లు (రిలయన్స్ ఇండస్ట్రీస్)
➤కుమార్ మంగళం బిర్లా కుటుంబం: రూ. 6,47,700 కోట్లు (ఆదిత్య బిర్లా గ్రూప్)
➤జిందాల్ కుటుంబం: రూ. 5,70,900 కోట్లు (జె.ఎస్.డబ్ల్యు స్టీల్)
➤బజాజ్ ఫ్యామిలీ: రూ. 5,64,200 కోట్లు (బజాజ్ గ్రూప్)
➤మహీంద్రా కుటుంబం: రూ. 5,43,800 కోట్లు (మహీంద్రా & మహీంద్రా)
➤నాడార్ కుటుంబం: రూ. 4,68,900 కోట్లు (హెచ్‌సిఎల్ టెక్నాలజీస్)
➤మురుగప్ప కుటుంబం: రూ. 2,92,400 కోట్లు (చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ & ఫైనాన్స్ కంపెనీ)
➤ప్రేమ్‌జీ కుటుంబం: రూ. 2,78,600 కోట్లు (విప్రో)
➤అనిల్ అగర్వాల్ కుటుంబం: రూ. 2,55,000 కోట్లు (హిందూస్తాన్ జింక్)
➤డాని, చోక్సీ & వకీల్ కుటుంబాలు: రూ. 2,20,900 కోట్లు (ఏషియన్ పెయింట్స్)
The 2025 Barclays Private Clients Hurun India Most Valuable Family Businesses List ranks India’s top family-run enterprises. Ambani Family leads, followed by Kumar Mangalam Birla & Jindal families. Reliance Industries remains India’s most valuable family business. pic.twitter.com/I57WJFy5JC
— HURUN INDIA (@HurunReportInd) August 12, 2025