కోతులు, కుక్కల సమస్యపై నిరసన | - | Sakshi
Sakshi News home page

కోతులు, కుక్కల సమస్యపై నిరసన

Oct 15 2026 8:48 AM | Updated on Oct 15 2026 8:48 AM

చుంచుపల్లి/రుద్రంపూర్‌: కుక్కలు, కోతులతో ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నా స్పందించడం లేదంటూ గ్రామసభను బహిష్కరించిన ఘటన ఇది. చుంచుపల్లి మండలం గౌతంపూర్‌ గ్రామంలో బుధవారం గ్రామసభ ఏర్పాటుచేశారు. గ్రామసర్పంచ్‌ కల్యాణి, కార్యదర్శి షర్మిల ఆధ్వర్యాన సభ నిర్వహణపై చాటింపు వేసి పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాట్లు చేశారు. అయితే, ప్రధాన ప్రాంతాల్లో కోతులు, కుక్కల బెడదను పరిష్కరించాలని గ్రామస్తులు కొన్నాళ్లుగా కోరుతున్నారు. దీనికి స్పందన లేదంటూ వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు సభను బహిష్కరించారు. సర్పంచ్‌, కార్యదర్శి హాజరై వేచి చూసినా గ్రామస్తులతో పాటు వార్డుసభ్యులు కూడా రాకపోవడం గమనార్హం. గతంలో డీపీఓ కోతులు పట్టించాలని ఆదేశించినా సిబ్బంది పట్టించుకోవడం లేదని, గ్రామానికి రూ.కోటి మేర నిధులు ఉన్నా ప్రాథమిక సమస్యలను పరిష్కరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు వెల్లడించారు.

గౌతంపూర్‌ గ్రామసభ బహిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement