ఆదిలక్ష్మిగా అమ్మవారు.. | - | Sakshi
Sakshi News home page

ఆదిలక్ష్మిగా అమ్మవారు..

Oct 13 2026 12:17 AM | Updated on Oct 13 2026 12:17 AM

భద్రాచలంలో శ్రీదేవీ శరన్నవరాత్రి

ఉత్సవాలు ప్రారంభం

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో సోమవారం శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు మహాలక్ష్మి అమ్మవారిని అర్చకులు ఆదిలక్ష్మి అవతారంలో అలంకరించి, ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. చతుర్భుజాలతోపై రెండు చేతుల్లో పద్మాలను ధరించి, మరో రెండు చేతులతో వరదాభయ ముద్రలను ప్రదర్శిస్తూ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. పలువురు మహిళలు కుంకుమార్చనలు సమర్పించారు. మారుతి సదనంలో ఆలయ వైదిక కమిటీ శ్రీరామాయణ పారాయణ మహోత్సవాలను ప్రారంభించింది. తొలిరోజు రామాయణంలోని బాలకాండను పారాయణం చేశారు. శ్రీరామనామ స్మరణ, వేదమంత్రోచ్ఛారణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. కాగా, నేడు మహాలక్ష్మి అమ్మవారు సంతానలక్ష్మిగా దర్శనమివ్వనున్నారు.

సీతారాముల నిత్యకల్యాణం..

భద్రగిరి రామాలయంలో సీతారాముల నిత్యకల్యా ణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజాము న గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు జరిపారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ తదితర క్రతువులను అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించి నిత్యకల్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement