ఢిల్లీ చేరుకున్న మంత్రులు, డీసీసీ అధ్యక్షులు | - | Sakshi
Sakshi News home page

ఢిల్లీ చేరుకున్న మంత్రులు, డీసీసీ అధ్యక్షులు

Oct 13 2026 12:17 AM | Updated on Oct 13 2026 12:17 AM

కొత్తగూడెంఅర్బన్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి డీసీసీ అధ్యక్షురాలు తోటదేవీప్రసన్న, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగసీతారాములు, ఇతర నాయకులు సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ(సర్‌)లో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని, తొలగించిన 13 కోట్ల మంది ఓటర్లను తిరిగి ఓటర్‌ లిస్టులో చేర్చాలని, సర్‌ ప్రోగ్రాం పూర్తిగా ఆపాలని, బ్యాలెట్‌ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని, సీఈసీ జ్ఞానేశ్వర్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ఏఐసీసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. నిరసనల్లో పాల్గొనేందుకు ఇక్కడి నుంచి తరలివెళ్లారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్‌ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ, ఇండియా కూటమి ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement