భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌ పేరు మార్చాలి | - | Sakshi
Sakshi News home page

భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌ పేరు మార్చాలి

Oct 13 2026 12:17 AM | Updated on Oct 13 2026 12:17 AM

రైల్వే మంత్రికి ఎమ్మెల్యే కూనంనేని లేఖ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌ పేరును కొత్తగూడెం రైల్వే స్టేషన్‌గా మార్చాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌, దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌లకు కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం లేఖలు పంపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైల్వే స్టేషన్‌ కొత్తగూడెంలో ఉన్నప్పటికీ భద్రాచలం రోడ్‌ పేరుతో పిలవడం వల్ల ప్రయాణికుల్లో తీవ్ర గందరగోళం నెలకొంటోందని అన్నారు. భద్రాచలం ఇక్కడి నుంచి చాలా దూరంలో ఉందని అన్నారు. ప్రాంతీయ అస్తిత్వాన్ని, ప్రజా ఆకాంక్షలను ప్రతిబింబించేలా స్టేషన్‌ పేరును మార్చాలని కోరారు.

రేపు జాబ్‌మేళా

రుద్రంపూర్‌: ఈ నెల 14న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పాన అధికారి కొండపల్లి శ్రీరామ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థలో మణుగురు, పాల్వంచ, ఇల్లెందు, కొత్తగూడెం ప్రాంతాల్లో 70 ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. కొత్తగూడెంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జాబ్‌మేళా ఉంటుందని, 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసుగల నిరుద్యోగులు హాజరుకావాలని కోరారు.

ఇల్లెందు ఎంపీడీఓకు రూ.3 వేల జరిమానా

ఆర్టీఐ కమిషనర్‌ ఆదేశాలు

ఇల్లెందురూరల్‌: మండలంలోని తిలక్‌నగర్‌ గ్రామపంచాయతీకి చెందిన మాచర్ల విజయ్‌కుమార్‌ సమాచార హక్కు చట్టం పరిధిలో సమాచారం కోసం మండల పరిషత్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. గడువు లోపు సమాచారం ఇవ్వకపోవడంతో ఆర్టీఐ కమిషనర్‌ను ఆశ్రయించాడు. కమిషనర్‌ ఇచ్చిన గడువులోగా కూడా దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఎంపీడీఓ ధన్‌సింగ్‌కు రూ.3వేల జరిమానా విధిస్తూ సమాచార హక్కు కమిషనర్‌ పీ.వీ.శ్రీనివాస్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

బార్‌ దరఖాస్తుల ఆదాయం రూ.3.56 కోట్లు

కొత్తగూడెంఅర్బన్‌: అశ్వారావుపేట మున్సిపాలిటీలో నూతన 2బి బార్‌ ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారం ముగిసింది. మొత్తం 356 దరఖాస్తులు రాగా, తద్వారా రూ. 3.56 కోట్ల ఆదాయం సమకూరింది. బార్‌ నిర్వహణకు ఏటా రూ. 30 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని, దరఖాస్తులతోనే 12 ఏళ్లకు మించి ఆదాయం సమకూరిందని జిల్లా ఎకై ్సజ్‌ అధికారి ఏ.శ్రీనివాసరెడ్డి తెలిపారు.

బ్లాస్టింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి

మణుగూరు టౌన్‌ : బొగ్గు సరైన పరిమాణంలో లభించేలా బ్లాస్టింగ్‌ సమయంలో తగిన జాగ్రత్తలు చేపట్టాలని సింగరేణి డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) ఎల్‌వీ సూర్యనారాయణ అన్నారు. సోమవారం ఏరియా జీఎం దుర్గం రాంచందర్‌తో కలిసి ఆయన కేసీహెచ్‌పీ, పీకేఓసీ గనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ షేల్‌ పికింగ్‌ ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని, బొగ్గులో మట్టి, రాళ్లు కలవకుండా జాగ్రత్తలు చేపట్టాలని, ప్రాసెసింగ్‌ సమయంలో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. క్రషర్ల నిర్వహణలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. పీకేఓసీ–2లో బొగ్గు వెలికితీత పనులను పరిశీలించి, ఉత్పత్తిని పెంచేందుకు షావెల్స్‌ సంఖ్య పెంచుకోవాలని చెప్పారు. ఓసీ–4లో ఓబీ వెలికితీత, కంటిన్యూయస్‌ మైనర్‌ ప్రాంతాన్ని సందర్శించి ఓబీ వెలికితీత పురోగతిని సమీక్షించారు. ఏరియా అధికారులు శ్రీనివాసచారి, రాంబాబు, రమేశ్‌, మదన్‌నాయక్‌, గౌడే, సౌరభ్‌సుమన్‌, సురేశ్‌, నాగరమేశ్‌, నాగేశ్వరరావు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement