పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారు ఆదివారం శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు. భక్తులు, అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని శ్రీ కనుకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి)లో శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అర్చకులతో కలిసి జ్యోతిప్రజ్వలన, కలశస్థాపన పూజ చేసి ప్రారంభించారు. అనంతరం విఘ్నేశ్వరపూజ, పుణ్యావాచనం, అఖండ దీపారాధన, దీక్షారాధన, గోపూజ ఘనంగా నిర్వహించారు. సోమవారం శ్రీ అన్నపూర్ణ సమేతా కాశీ విశ్వేశ్వరస్వామి వారికి లక్ష బిల్వార్చన, బాలా పూజలు నిర్వహించనున్నారు. నేడు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, రీజినల్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ కన్వీనర్ బాదర్ల జోషికుమార్, మాజీ డీసీసీబీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సర్పంచ్ బానోత్ శ్రీదేవి, బి.అనిత పాల్గొన్నారు.
భక్తులకు దర్శనమిచ్చిన పెద్దమ్మతల్లి అమ్మవారు


