బహుజనుల హక్కుల సాధనకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

బహుజనుల హక్కుల సాధనకు పోరాటం

Oct 12 2026 2:49 AM | Updated on Oct 12 2026 2:49 AM

అశ్వాపురం: బహుజనులు హక్కుల సాధనకు ఐక్యంగా పోరాటాలు సాగించాలని అరుణోదయ సాంస్కృతిక కళాకారిణి విమలక్క అన్నారు. మండల పరిధిలోని మొండికుంట, మల్లెలమడుగు గ్రామాల్లో ఆదివారం బహుజన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి మొండికుంట నుంచి మల్లెలమడుగు వరకు బతుకమ్మలతో భారీ ర్యాలీ నిర్వహించారు. మల్లెలమడుగులో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ బహుజనుల హక్కుల సాధనకు ప్రజలను చైతన్యం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బహుజన బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యమ్రంలో సర్పంచ్‌లు మర్రి సంధ్య, మచ్చా నరసింహారావు, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి అరుణక్క, పెదగోని ఆదిలక్ష్మి, మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత, ఏఐటీయూసీ జిల్లా నాయకురాలు రెడ్డి అరుణ, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

అరుణోదయ సాంస్కృతిక

కళాకారిణి విమలక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement