అవగాహన కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అవగాహన కలిగి ఉండాలి

Oct 9 2026 12:26 AM | Updated on Oct 9 2026 12:26 AM

పాల్వంచరూరల్‌: క్షయ వ్యాధిపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ సూచించారు. పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకాశ్‌ నడ్డా ప్రారంభించిన టీబీ ముక్త్‌ భారత్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని విద్యార్థులతో కలిసి వీక్షించారు. జిల్లా క్షయ వ్యాధి కోఆర్డినేటర్‌ టి.సోమయ్య, ప్రిన్సిపాల్‌ పద్మ, వేముల కామేశ్వరరావు, ధర్మారావు, డి.రమేష్‌, శ్రీదేవి, విజయప్రసాద్‌, శిరీష పాల్గొన్నారు.

తుమ్మల చెరువును

సందర్శించిన డీపీఓ

అశ్వాపురం: కాకతీయుల కాలంనాటి తుమ్మలచెరువును జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పర్యాటక అధికారి బి. అనూష గురువారం సందర్శించారు. పర్యాటక వసతులు, బోట్ల నిర్వహణ తీరును పరిశీలించారు. గతంలో కేటాయించిన బోట్లకు మరమ్మతులు చేపట్టాలని బోటింగ్‌ నిర్వాహకులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. హ్యాండ్‌ బోట్ల వల్ల పర్యాటకులకు, నిర్వాహకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మోటార్‌ బోట్లను మంజూరు చేయాలని కోరారు. సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తానని డీపీఓ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం ఎంపీడీఓ ముత్యాల రావు, తుమ్మలచెరువు సర్పంచ్‌ ఎట్టి నరేష్‌, పంచాయతీ కార్యదర్శి దినేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ఎకై ్సజ్‌ వాహనాల వేలం

ఇల్లెందు: వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఎకై ్సజ్‌ కార్యాలయంలో గురువారం వేలంపాట నిర్వహించారు. 8 వాహనాలకు రూ.1.61 లక్షలు ధర నిర్ణయించగా పలువురు పోటీ పడటంతో జీఎస్టీతో కలిపి రూ.3.36 లక్షలు ఆదాయం లభించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అదనంగా 77 శాతం ఆదాయం వచ్చింది. ఎక్సైజ్‌ అధికారులు ఎన్‌.శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, హనుమంతరావు వేలంపాటను పర్యవేక్షించారు.

సీఐ, ఇద్దరు ఏఎస్‌ఐలకు సేవా పతకాలు

అశ్వాపురం/పినపాక/గార్ల: విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన సీఐ, ఇద్దరు ఏఎస్‌ఐలను సేవా పతకాలు వరించాయి. ఈ. బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు కఠిన సేవా పతకం లభించింది. అశ్వాపురం ఏఎస్సై రామచంద్రారెడ్డికి ఉత్తమ సేవా పతకం, మహబూబాబాద్‌ జిల్లా గార్ల వాసి, ఇల్లెందు ఏఎస్సై మాద వెంకటేశ్వర్లుకు సేవా పతకం లభించాయి. వీరికి గురువారం ఎస్పీ రోహిత్‌రాజు పతకాలు అందజేసి అభినందించారు.

పశువులు స్వాధీనం

భద్రాచలంఅర్బన్‌: అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాన్ని గురువారం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్‌ వద్ద శ్రీలక్ష్మీనరసింహ సేవా సమితి సభ్యులు ఆపారు. డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో పోలీసులు చేరుకుని వాహనాన్ని, డ్రైవర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ములకలపల్లి, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పశువులను పాల్వంచ గోశాలకు తరలించారు.

ముద్దాయికి

18 నెలల జైలు శిక్ష

దమ్మపేట: మండలంలో 2017లో జరిగిన భూ వివాదం, దాడి కేసులో నిందితులకు దమ్మపేట కోర్టు గురువారం జైలు శిక్ష విధించింది. లంకాలపల్లికి చెందిన వగ్గెల పొట్టి, ముచిక బాలరాజు 2017, మార్చి 18న జీడి తోటలో పనులు చేస్తుండగా భూ వివాదం కారణంగా ఊకే శ్రీను, ఊకే వెంకటేశ్వరరావు కర్రలతో దాడి చేశారు. దీంతో బాలరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి బి.భవాని నిందితులు వెంకటేశ్వరరావుకు 18 నెలల జైలు శిక్ష, రూ.1500ల జరిమానా, శ్రీనుకు రూ.1500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement