కొనుగోళ్లకు రెడీ | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లకు రెడీ

Oct 8 2026 12:24 AM | Updated on Oct 8 2026 12:24 AM

క్వింటాల్‌కు రూ.2,461

జిల్లాలో 160 ధాన్యం కేంద్రాలు ప్రారంభం

లక్షా 28 మెట్రిక్‌ టన్నుల వడ్లు సేకరించాలని లక్ష్యం

పాల్వంచరూరల్‌: సన్నరకం ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల శాఖ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. వరి కోతలు ఇంకా ప్రారంభం కాకపోయినా ఈసారి ముందస్తుగానే స్పందించింది. జిల్లాలో వానాకాలం సీజన్‌లో లక్షా 69 వేల ఎకరాల్లో వరిసాగు చేయాల్సి ఉండగా ఎల్‌ నినో ప్రభావంతో లక్షా 39 వేల ఎకరాల్లోనే సాగు చేసినట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. మొత్తం 2.60 లక్షల మెట్రిక్‌ టన్ను(ఎంటీ)ల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసింది. ఇందులో లక్షా 28 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 190 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే 160 కేంద్రాలు ప్రారంభించారు. మొత్తం కేంద్రాల్లో సహకార సొసైటీ ఆధ్వర్యంలో 115, జీసీసీ ఆధ్వర్యంలో 30, ఐకేపీ ఆధ్వర్యంలో 19, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 26 కేంద్రాలు నిర్వహించనున్నారు.

ముందస్తుగా ప్రారంభిస్తున్నాం

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈసారి ముందస్తుగా ప్రారంభిస్తున్నాం. కేంద్రాల్లో సన్న రకం, దొడ్డరకం కొనుగోలు ప్రక్రియను వేర్వేరుగా నిర్వహిస్తాం. సన్నరకాలను గుర్తించే యంత్ర పరికరాలను కూడా అందుబాటులో ఉంచాం. రైతులు నిర్దేశిత నిబంధనల ప్రకారం ధాన్యం తేవాలి.

–ఎస్‌.త్రినాథ్‌బాబు, జిల్లా పౌరసరఫరాల

కార్పొరేషన్‌ మేనేజర్‌

గతేడాది వానాకాలంలో 2.38లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, లక్షా 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. ఇక సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌ చెల్లించనున్నారు. ప్రతీ కేంద్రానికి ప్రత్యేక సీరియల్‌ నంబర్‌తోపాటు గన్నీ బ్యాగులపైనా సీరియల్‌ నంబర్లను ముద్రించనున్నారు. మార్కెటింగ్‌ శాఖ ద్వారా ఏ గ్రేడ్‌ సన్న రకం ధాన్యానికి క్వింటాకు రూ.2,461, సాధారణ రకం క్వింటాకు రూ.2,441 చొప్పున మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది సన్నరకం క్వింటాకు రూ.2,389కాగా, ఈసారి అదనంగా రూ.70 పెంచింది. గతేడాది దొడ్డు రకాలు క్వింటాకు రూ.2,300 చెల్లించగా ఈసారి రూ.72 అదనంగా పెంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement