ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లే రహదారుల్లో మొక్కజొన్న తీసుకొచ్చిన వాహనాలతో రద్దీ నెలకొంది. ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్న యాసంగి మొక్కజొన్నలను మార్కెట్‌లో నూతనంగా నిర్మిస్తున్న షెడ్లలో నిల్వ చేస్తున్నారు. మిర్యాలగూడ, ఏపీలోని జగ్గయ్యపేట గోదాములు నిండిపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా నలుమూలల నుంచి రెండు రోజులుగా వాహనాలు వస్తుండడంతో బుధవారం మరింత రద్దీ నెలకొంది. మార్కెట్ ఆవరణలోనే కాక సమీప రహదారుల వెంట వాహనదారలు బారులుదీరాయి. అయితే, చాలినంత మంది హమాలీలు లేకపోవటంతో దిగుమతిలో జాప్యం జరుగుతుండగా.. పోలీసులు కలగజేసుకోవాల్సి వచ్చింది.


