సింగరేణిలో రూ.4.51కోట్ల విలువైన యంత్రం
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి జేవీఆర్ ఓసీ బేస్ వర్క్‌షాప్‌లో రూ.4.51 కోట్ల విలువైన యంత్రం అందుబాటులోకి వచ్చింది. బొగ్గు ఉత్పత్తిలో భాగంగా అత్యధిక వేగంతో తవ్వగల టాటా కంపెనీకి చెందిన హిటాచీ షావెల్‌ను ఓసీల జీఎం సూర్యనారాయణ రాజు సోమవారం ప్రారంభించి మాట్లాడారు. సింగరేణిలో ఎక్కువ బొగ్గు ఉత్పత్తి సత్తుపల్లి ఓసీల్లోనే జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన యంత్రం ద్వారా ఉత్పత్తిలో మరింత వేగం పెరుగుతుందని చెప్పారు. ఏరియా జీఎం శ్రీనివాస్, పీఓ ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.


