సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య
చుంచుపల్లి: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పారదర్శకంగా అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య సూచించారు. సోమవారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సబ్‌కా యోజన సబ్‌కా వికాస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచా యతీల పరిధిలో అవసరమైన ప్రధాన పనులను గుర్తించాలని చెప్పారు. అనంతరం 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.3.19 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ విద్యాలత, డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య


