తండ్రిని హత్య చేసిన తనయుడు | - | Sakshi
Sakshi News home page

తండ్రిని హత్య చేసిన తనయుడు

Jun 20 2026 5:46 AM | Updated on Jun 20 2026 5:46 AM

బొల్లాపల్లి: డబ్బులు ఇవ్వలేదని తండ్రిని, కుమారుడు కరత్రో కొట్టడంతో మృతి చెందిన విషయం పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. బండ్లమోటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గజ్జ చిన్న నరసయ్య(72)కు ముగ్గురు కుమారులు.మూడో కుమారుడు గజ్జ భద్రయ్య మతిస్థిమితం తక్కువ కావడంతో పెళ్లి కాలేదు. భద్రయ్య, తండ్రితో కలిసి ఉంటున్నాడు. క్రాప్‌ చేయించుకోవడానికి తండ్రిని డబ్బులు అడగ్గా ఇవ్వకపోవడంతో, ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో కుమారుడు కర్రతో తండ్రి తలపై కొట్టడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మతిస్థిమితం తక్కువగా ఉన్న మూడో కుమారుడు బాదరయ్య ఏడాది క్రితం కన్నతల్లి సోమమ్మ ను రాడ్డుతో మోదడటంతో అప్పట్లో తల్లి మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సయ్యద్‌ సమీర్‌బాషా తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement