కోఢీ
అధికార పార్టీ నేతల అండదండలు చుట్టు పక్కల నియోజకవర్గాల నుంచి పందెంరాయుళ్లు రాక రూ. లక్షల్లో బెట్టింగులు
చీరాల నియోజకవర్గ పరిధిలో జోరుగా కోడి పందేలు
తూర్పుపాలెం బరిలో
పోరాడుతున్న కోడిపుంజులు
సాక్షి టాస్క్‌ఫోర్సు: చీరాల నియోజకర్గ పరిధిలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పెద్ద ఎత్తున కోడిపందేలు బుధవారం జరిగాయి. అధికార పార్టీ నాయకుడి కుమారుడే స్వయంగా కోడిపందేలు ప్రారంభించాడని సమాచారం. చల్లారెడ్డి పాలెం గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు ఈ కోడి పందేలను పర్యవేక్షించారు. గడిచిన 10 ఏళ్లలో చీరాల నియోజకవర్గ పరిధిలో కోడి పందేలు బరులు బహిరంగా ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం.
వేటపాలెం మండల పరిధిలోని అక్కాయిపాలెం, కఠారివారిపాలెం గ్రామాల మధ్యగల పొలాల్లో ప్రత్యేక బరులు ఏర్పాటు చేసి ఉదయం నుంచి రాత్రి వరకు కోడి పందేలు కొనసాగిస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి పందెం రాయుళ్లు జోరుగా కోడిపందేల్లో పాల్గొన్నారు. పందేలు చూసేందుకు వచ్చిన వేల మంది జనం పందేలు కాసుకున్నారు. అక్కాయిపాలెం నుంచి కఠారివారిపాలెం వెళ్లే రోడ్డుకు రెండు వైపులా అధికార పార్టీ నాయుకలు ఫెక్సీలు ఏర్పాటు చేశారు. రూ. లక్షలో నగదు చేతులు మారినట్లు సమాచారం. బరుల వద్దే మద్యం, తినుంబండారాలు బహిరంగంగా విక్రయాలు జరిగాయి. గంజాయి తాగి హల్‌చల్ చేశారు. నాయకులు బరి తెగించి ఈ పందేలతో పాటు జూద క్రీడలకు తెరలేపారు. ప్రభుత్వ అధికారికంగా అనుమతించిందని, అందుకే అటువైపు పోలీసులు గానీ అధికారులు కానీ వెల్లడించడం లేదనే ప్రచారం జరుగుతోంది.
కోఢీ
కోఢీ


